Maharaja Yoga: సింహ రాశిలో శుక్రుడి.. ఈ రాశుల వారికి మహా రాజయోగం..! లైఫ్ స్టైల్‌లో పెను మార్పులు

ఈ నెల 31 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. రవి అధిపతి అయిన సింహ రాశి శుక్రుడికి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశులకు మాత్రం శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి సింహ శుక్రుడు ఎక్కువగా మేలు చేయడం జరుగుతుంది.

Maharaja Yoga: సింహ రాశిలో శుక్రుడి.. ఈ రాశుల వారికి మహా రాజయోగం..! లైఫ్ స్టైల్‌లో పెను మార్పులు
Maharaj Yoga
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jul 24, 2024 | 7:18 PM

ఈ నెల 31 నుంచి ఆగస్టు 22వ తేదీ వరకు శుక్రుడు సింహ రాశిలో సంచారం చేయడం జరుగుతోంది. రవి అధిపతి అయిన సింహ రాశి శుక్రుడికి శత్రు క్షేత్రమే అయినప్పటికీ, కొన్ని రాశులకు మాత్రం శుభ యోగాలను ఇచ్చే అవకాశం ఉంది. మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనూ రాశుల వారికి సింహ శుక్రుడు ఎక్కువగా మేలు చేయడం జరుగుతుంది. శుక్రుడు సింహ రాశిలో సంచారం చేస్తున్నంత కాలంలో జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. సాధారణంగా జీవనశైలే మారిపోతుంది.

  1. మేషం: ఈ రాశికి పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల కొద్ది ప్రయత్నంతో మంచి పెళ్లి సంబంధం కుదరడం, పలుకుబడి కలిగిన వ్యక్తితో ప్రేమలో పడడం, వ్యాపారాల్లో కొత్తవారు పెట్టుబడులు పెట్టడం, వృత్తి జీవితం అభివృద్ధి చెందడానికి ప్రముఖులు సహాయపడడం వంటివి జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. పలుకుబడి విస్తరిస్తుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలం అవుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది.
  2. వృషభం: రాశ్యధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో, రవి క్షేత్రంలో ఉన్నందువల్ల ప్రభుత్వ మూలక ధన లాభం ఉంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారం అవుతుంది. ఆస్తి విలువ పెరుగు తుంది. తల్లి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి రావడం, సంపద వృద్ధి చెందడం వంటివి జరుగు తాయి. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. పేరు ప్రతిష్ఠలు లభిస్తాయి.
  3. కర్కాటకం: ఈ రాశికి ధన స్థానంలో శుక్ర సంచారం వల్ల విలాస జీవితం అలవడుతుంది. జీవన శైలిలో పూర్తిగా మార్పు వస్తుంది. ధనపరంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయడం ఎక్కువవుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సాధి స్తారు. మాటకు విలువ పెరుగుతుంది. ఆస్తి, గృహ సంబంధమైన ఒప్పందాలు కుదురుతాయి.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ప్రవేశించడం వల్ల అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధికి అవకాశం ఉంటుంది. విలాస జీవితం అనుభవిస్తారు. శృంగార జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభిం చడం జరుగుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. మాటకు విలువ పెరుగుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనారోగ్యాల నుంచి కోలుకునే అవకాశముంది.
  5. వృశ్చికం: ఈ రాశికి దశమ స్థానంలో శుక్ర సంచారం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, పదోన్నతి లభించడంతో పాటు పనిభారం, ఒత్తిడి పూర్తిగా తగ్గిపోతాయి. ఉద్యోగంలో శీఘ్ర పురోగతి ఉంటుంది. జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆర్థిక ప్రయత్నాలన్నీ విజయం సాధి స్తాయి. సహోద్యోగితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం నిశ్చయం కావడం గానీ జరుగు తుంది. ఉద్యోగం మారడానికి ఇది అనుకూలమైన సమయం. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి భాగ్య స్థానంలో శుక్ర సంచారం వల్ల తల్లి నుంచి గానీ జీవిత భాగస్వామి నుంచి గానీ సంపద లభించే అవకాశం ఉంది. విదేశీ యానానికి మార్గం సుగమం అవుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం పెరిగి ఆర్థిక సమస్యలు దాదాపు పూర్తిగా తొలగిపోతాయి. తీర్థ యాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. అనేక విధాలుగా ధనాదాయం పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు, లాటరీలు, షేర్ల వల్ల కలిసి వస్తుంది.