Lucky Stars 2025: ఈ నక్షత్రాల వారికి ఈ ఏడాది మహర్దశ.. పట్టిందల్లా బంగారం కావడం పక్కా..!
Stars Astrology: ఈ సంవత్సరం భరణి, రోహిణి సహా మరికొన్ని నక్షత్రాల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య రంగాల్లో గణనీయమైన ప్రగతి ఉంటుంది. కోరికలు నెరవేరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు, ఉన్నత పదవులు, పెళ్లి సంబంధాలు లభిస్తాయి. షేర్లు, వ్యాపారాల్లో లాభాలు పొందే అవకాశం కూడా ఉంది.

Lucky Stars 2025
ఈ ఏడాది కొన్ని నక్షత్రాల వారికి మహర్దశ పట్టబోతోంది. అనేక విధాలుగా అదృష్టాలు పండించు కునే అవకాశం ఉంది. ఇతరులందరి కంటే ఈ నక్షత్రాల వారికి గ్రహ బలం మరింత అనుకూలంగా ఉండడం వల్ల ఆకస్మిక ధన, ఉద్యోగ, ఆర్థిక, ఆరోగ్య లాభాలు కలుగుతాయి. ఈ నక్షత్రాలుః భరణి, రోహిణి, పుష్యమి, హస్త, స్వాతి, ఉత్తరాషాఢ. వీరికి రాబోయే ఆరేడు నెలల్లో తప్పకుండా పట్టిందల్లా బంగారం అవుతుంది. మనసులోని కోరికలు, ఆశలు, ఆశయాలు నెరవేరుతాయి.
- భరణి: శుక్రుడికి చెందిన ఈ నక్షత్రం వారికి ఈ ఏడాది అనేక విధాలుగా ధన యోగాలు, రాజయోగాలు పట్టబోతున్నాయి. ముఖ్యంగా మనసులోని కోరికలు, కలలు సాకారమవుతాయి. నిరుద్యోగులకు ఊహించని స్థాయి ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులను చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది.
- రోహిణి: చంద్రుడికి చెందిన ఈ నక్షత్రం ఈ ఏడాది ఒక వెలుగు వెలగబోతోంది. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. అంచనాలకు మించి జీతభత్యాలు పెరుగుతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు వంటివి బాగా లాభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు విదేశీ ఉద్యోగం సంపాదిస్తారు.
- పుష్యమి: శని అధిపతి అయిన పుష్యమి నక్షత్రం వారు ఉద్యోగంలో ఉన్నత పదవుల్ని చేపడతారు. ఉద్యోగు లకు డిమాండ్ బాగా పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఉద్యోగం మార డానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆదాయపరంగా అదృష్టం తలుపు తడుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు అత్యధికంగా లాభిస్తాయి.
- హస్త: చంద్రుడు అధిపతిగా ఉన్న ఈ నక్షత్రం వారు ఒక సంస్థకు అధిపతిగా మారే అవకాశం ఉంది. అనేక విధాలుగా రాజయోగాలు, ధన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. ఉద్యోగానికి సంబం ధించిన ఏ ప్రయత్నమైనా విజయవంతంగా నెరవేరుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది.
- స్వాతి: రాహువు అధిపతి అయిన ఈ నక్షత్రానికి చెందినవారు తప్పకుండా భాగ్యవంతులయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలను మించుతుంది. ఉద్యోగంలో అధికార లాభం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశాల్లో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి.
- ఉత్తరాషాఢ: గ్రహ రాజైన రవి ఈ నక్షత్రానికి అధిపతి అయినందువల్ల ఈ నక్షత్రానికి చెందినవారు ఏదైనా సంస్థకు సర్వాధికారి అయ్యే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో వీరికి రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. రావలసిన సొమ్మంతా చేతికి అందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. ఉద్యోగం మారడానికి బాగా అవకాశం ఉంది. నిరుద్యోగులకు తప్ప కుండా ఉద్యోగ యోగం పడుతుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి నిశ్చయం అవుతుంది.