ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు పుట్టుకతోనే తెలివైనోళ్లు.. మాటలతో మాయ చేస్తారు తెలుసా..?
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీల ద్వారా మన జీవిత మార్గం, భవిష్యత్తు నిర్ధారించబడుతుంది. ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన పిల్లలు ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంఖ్య 5 శక్తితో పిల్లలు తెలివితేటలతో, శీఘ్ర అభివృద్ధితో ఎదుగుతారు. ఇప్పుడు వారి ప్రత్యేకతలు తెలుసుకుందాం.

సంఖ్యాశాస్త్రం.. ఇది మన పుట్టిన తేదీల్లో దాగివున్న సంకేతాల ఆధారంగా జీవితాన్ని అర్థం చేసుకునే మార్గం. కేవలం లెక్కలు కాదు.. మన ఆలోచన, ప్రవర్తన, ఇష్టాలు, అయిష్టాలు, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పే శాస్త్రం. ప్రతి వ్యక్తికి సంబంధించిన సంఖ్య అతని ప్రత్యేకతలు, బలాలు, బలహీనతలను తెలియజేస్తుంది.
సంఖ్య 1 నుండి 9 వరకు ప్రతి సంఖ్యకు తనకు తానే ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటుంది. ఇవి మన నిర్ణయాలు, సంబంధాలు, జీవిత మార్గాన్ని ప్రభావితం చేస్తాయి. సంఖ్యాశాస్త్రం మనలో దాగివున్న శక్తిని గుర్తించి ముందుకు నడిపించే అవకాశాన్ని ఇస్తుంది. పుట్టినప్పటి నుండే ధనవంతులుగా మారే పిల్లల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సంఖ్యాశాస్త్రం ప్రకారం.. 5, 14, 23 తేదీలలో పుట్టినవారి సంఖ్య 5. ఈ సంఖ్యకు పాలక గ్రహం బుధుడు. బుధుడు తెలివితేటలు, సంభాషణ, వ్యాపార నైపుణ్యాలను సూచిస్తాడు. అందుకే ఈ తేదీల్లో జన్మించిన పిల్లలు ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటారు.
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు చాలా తెలివిగా ఉంటారు. వారి మనస్సు ఇతరులతో పోల్చితే వేగంగా పనిచేస్తుంది. సమస్యలు వస్తే వాటిని సులభంగా పరిష్కరించగలరు. త్వరగా ఏ విషయాన్నైనా గ్రహించే సామర్థ్యం వీరికి ఉంటుంది. దీని వల్ల జీవితంలో వారు ముందుకు సాగడం తేలికగా ఉంటుంది.
ఈ సంఖ్య పిల్లలు మాట్లాడటంలో ఎంతో నైపుణ్యం చూపుతారు. వారి మాటలు ఆకర్షణీయంగా ఉంటాయి. ఇతరులతో స్నేహం చేయడం వీరికి తేలికగా ఉంటుంది. చక్కటి సంభాషణతో చుట్టుపక్కల ఉన్న వారిని తమవైపు తిప్పుకుంటారు.
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు సామాజికంగా ఎంతో చురుకుగా ఉంటారు. స్నేహితులతో కలిసి ఉండడం, కొత్త విషయాలు తెలుసుకోవడం వీరికి ఇష్టం. సంప్రదాయాలకు మాత్రమే కట్టుబడి ఉండకుండా మార్పును స్వీకరించడంలో ముందుంటారు. కొత్త ఆలోచనలను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.
ఈ తేదీల్లో పుట్టిన పిల్లలు పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. శరీరం, వస్త్రాలు, నివాసం అన్నింటినీ శుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తారు. ఈ పరిశుభ్రత లక్ష్మీదేవి ఆశీస్సులు అందుకునేందుకు మార్గం అవుతుంది. అందువల్ల వారు చిన్ననాటి నుంచే ధనసంపత్తితో కనిపిస్తారు.




