హిందూమతంలో అనేక మత విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది ఈ విశ్వాసాలను మూఢనమ్మకాలుగా భావిస్తారు. అదే సమయంలో కొంత మంది అమితంగా ఈ విశ్వాసాలను నమ్ముతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పూర్వ కాలం నుండి కొన్ని నమ్మకాలు ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నమ్మకాలలో ఒకటి బూట్లు, చెప్పుల చోరీ. నేటికీ చాలామంది బూట్లు, చెప్పులు దొంగిలించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా దేవాలయాల్లో పాదరక్షలు చోరీ అయితే శని పోయిందని భావిస్తారు. దేవాలయంలో శనివారం ‘బూట్లు, చెప్పులు’ ఆలయం నుండి పోగొట్టుకుంటే అది మీకు శుభసూచకానికి సంకేతం.
శనివారం రోజు ఆలయంలో బూట్లు లేదా చెప్పులు దొంగిలిస్తే అది మీకు చాలా శుభప్రదమని జ్యోతిష్యులు చెప్పారు. శనివారం రోజున పాదరక్షలు దొంగిలించబడినట్లయితే చెడు కాలం త్వరలో ముగియబోతోందని.. భవిష్యత్తులో జీవితంలో సుఖ సంతోషాలు రానున్నాయని అర్థం. అంతేకాదు సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతారు.
జ్యోతిష్య శాస్త్రంలో శనిశ్వరుడు మానవుని పాదాలలో ఉంటాడని నమ్ముతారు. పాదాలతో శనీశ్వరుడికి ఉన్న సంబంధము వలన పాదరక్షలు, చెప్పులు కూడా శని కారకంగా మారతాయి. అందుకే ఎవరి పాదరక్షలు, చెప్పులు దొంగిలించబడినా లేదా దానం చేసినా శనీశ్వరుడు ఆశీర్వాదం మీపై ఉంటుందని.. అతను సంతోషంగా ఉంటాడని నమ్ముతారు. శనీశ్వరుడు ఆశీర్వదం లభిస్తుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడి ఎవరి జాతకంలో అ శుభ స్థానంలో ఉంటాడో వారికి కష్టాలు ఏర్పడతాయి. ఏ పని చేపట్టినా విజయం లభించదు. అటువంటి పరిస్థితిలో ఎవరి బూట్లు, చెప్పులు అయినా శనివారం ఆలయం నుండి దొంగిలించబడినట్లయితే .. అది మీకు శుభం. శనివారం రోజున పాదరక్షలు, చెప్పులు దొంగిలించడం లేదా దానం చేయడం చాలా శుభప్రదం. దీనితో శనీశ్వరుడి ఆశీర్వాదంతో మీ కష్టాలు త్వరగా తొలగిపోయి సుఖ సంతోషాలు లభిస్తాయని విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు