Kuja Gochar 2024: ‘మంగళ’ యోగం.. ఆ రాశుల వారి జీవితాల్లో కనీవినీ ఎరుగని శుభ ఫలితాలు..!

Mars Transit: ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆరు రాశుల వారి జీవితాల్లో కనీవినీ ఎరుగని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆదాయం, హోదా, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు వంటి విషయాల్లో తప్పకుండా శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వరకు కుజుడు మకర రాశిలో, అంటే తన ఉచ్ఛ రాశిలో సంచరించడం జరుగుతుంది.

Kuja Gochar 2024: ‘మంగళ’ యోగం.. ఆ రాశుల వారి జీవితాల్లో కనీవినీ ఎరుగని శుభ ఫలితాలు..!
Mars Transit
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 31, 2024 | 6:43 PM

ఫిబ్రవరి 6వ తేదీ నుంచి ఆరు రాశుల వారి జీవితాల్లో కనీవినీ ఎరుగని సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఆదాయం, హోదా, ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలు వంటి విషయాల్లో తప్పకుండా శుభ పరిణామాలు సంభవిస్తాయి. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి మార్చి 16వరకు కుజుడు మకర రాశిలో, అంటే తన ఉచ్ఛ రాశిలో సంచరించడం జరుగుతుంది. మేష, వృశ్చిక రాశులకు అధిపతి అయినందువల్ల, కర్కాటకం, ధనుస్సు, మీన రాశులకు ఆధిపత్యం రీత్యా శుభుడు అయినందువల్ల, మకర రాశిలోనే ఉచ్ఛపట్టినందువల్ల కుజుడు ఈ రాశులకు తప్పకుండా మంచి ఫలితాలను మాత్రమే ఇవ్వడం జరుగుతుంది.

  1. మేషం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు దశమ స్థానంలో ఉచ్ఛపట్టడం, దశమ కేంద్రంలో ఉచ్ఛపట్టిన కారణంగా దిగ్బలం కూడా ఏర్పడడం వల్ల ఈ రాశివారికి తప్పకుండా విపరీత రాజయోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలపరంగానే కాకుండా సామాజికంగా కూడా స్థాయి, హోదా పెరిగే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి వ్యక్తిగా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి.
  2. కర్కాటకం: ఈ రాశివారికి పంచమ, దశమాధిపతిగా కుజుడు పూర్ణ శుభుడు అయినందువల్ల ఈ రాశివారిని ఉచ్ఛ కుజుడు అనేక విధాలుగా అందలాలు ఎక్కించడం జరుగుతుంది. పిల్లల విషయంలోనూ, వృత్తి, ఉద్యోగాల విషయంలోనూ అనేక శుభ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. పైగా, ఈ రాశికి సప్తమ స్థానంలో కుజుడు ఉచ్ఛపట్టినందువల్ల జీవిత భాగస్వామికి కూడా అదృష్టం పట్టే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. ఆదాయం బాగా పెరుగుతుంది.
  3. వృశ్చికం: ఈ రాశికి అధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉచ్ఛపట్టడం అనేక శుభవార్తలను తీసుకు రావడం జరుగుతుంది. ఊహించని స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక సర్వతా మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రముఖ వ్యక్తుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రయాణాలు బాగా లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు ఆశించిన కంపెనీల్లో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
  4. ధనుస్సు: ఈ రాశివారికి పంచమ, వ్యయాధిపతిగా కుజుడు పూర్ణ శుభుడు అయినందువల్ల ఈ రాశివారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. పిల్లల నుంచి అన్నీ శుభవార్తలే అందుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవు తుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చాలావరకు తగ్గిపో తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
  5. మకరం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన కుజుడు ఈ రాశిలో ఉచ్ఛపడుతుండడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. భూ సంబంధమైన ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. మాతృ భాగ్యం కలుగుతుంది. గృహ, వాహన సౌకర్యాలకు అవకాశం ఉంది.
  6. మీనం: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన కుజుడు లాభ స్థానంలో ఉచ్ఛపట్టడం వల్ల అనేక విధాలుగా ఆదాయం కలిసి వస్తుంది. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. పెద్దల నుంచి స్థిరాస్తి కలిసి వస్తుంది. సోదరులతో వివాదాలు పరిష్కారం అయి, సఖ్యత పెరుగుతుంది. ఆర్థికంగా ఏ ప్రయ త్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్ వంటి రంగాలు ఇబ్బడిముబ్బడిగా రాబడిని ఆర్జిస్తాయి. విదేశీయానానికి, తీర్థయాత్రలకు అవకాశం ఉంది.

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!