AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (ఫిబ్రవరి 1, 2024): మేష రాశి వారికి గురువారంనాడు ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికీ ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశివారికి ఆకస్మిక ధన లాభ సూచనలు.. 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు
Horoscope Today 01st February 2024
Janardhan Veluru
|

Updated on: Feb 01, 2024 | 5:01 AM

Share

దిన ఫలాలు (ఫిబ్రవరి 1, 2024): మేష రాశి వారికి గురువారంనాడు ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికీ ఇబ్బందేమీ ఉండదు. వృషభ రాశి వారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. మిథున రాశి వారికి మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

గ్రహ బలం కారణంగా సమయం బాగా అనుకూలంగా ఉంది. ఆదాయానికి, ఆర్థిక పరిస్థితికీ ఇబ్బందేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా కొన సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెళ్లి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబంతో దైవ దర్శనాలు చేసుకుంటారు. బాల్య మిత్రులను కలుసుకుంటారు. సతీమణితో అన్యోన్యత పెరుగుతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొద్ది ప్రయత్నంతో ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. ఉద్యోగంలో అధికారులు సానుకూలంగా వ్యవహరిస్తారు. వృత్తి నిపుణులు అంచనాలకు మించి సంపాదిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువుల నుంచి శుభ కార్యాలకు సంబంధించిన ఆహ్వా నాలందుతాయి. ఆదాయం, ఆరోగ్యం పరవాలేదనిపిస్తాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపో తుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

మనసులోని కోరికలు నెరవేరుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. పదోన్నతికి అవకాశం ఉంది. అవసరానికి ధనం వసూలు అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా సతీమణి నుంచి ఆశించిన శుభ వార్తలుందుతాయి. ఇంట్లో భారీగా మరమ్మతులు చేపడతారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

శారీరకంగా, మానసికంగా శ్రమ, ఒత్తిడి ఉంటాయి. ఉద్యోగ బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలను అత్యవసరంగా చక్కబెట్టాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి ఉంటుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. కొన్ని పెండింగు పనులు పూర్తి చేస్తారు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవహారాలను ఒక కొలిక్కి తెస్తారు. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలు అవుతుంది. కుటుంబంలో అపార్థాలు తలెత్తే సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో వేగం పెరుగుతుంది. వ్యాపారాలలో సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఎవరికీ ఎటువంటి వాగ్దానాలూ చేయకపోవడం మంచిది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా గడిచిపోతుంది. వృత్తి, ఉద్యోగాలలో ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో స్వల్పంగా లాభాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఆశించిన సమాచారం అందుతుంది. వ్యక్తిగత వ్యవహా రాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త పనులను చేపడతారు. ఆర్థిక కార్యకలాపాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబపరంగా ఆశించిన సహకారం లభిస్తుంది. ఆరోగ్యం పరవాలేదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. కొద్ది ప్రయత్నంతో ఎటువంటి వ్యవహారమైనా చక్కబడుతుంది. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోవడం జరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. తలపెట్టిన పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆరోగ్యం పరవా లేదు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఇంటా బయటా ఆచితూచి వ్యవహరించడ మంచిది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప లాభాలు అందు కుంటారు. ఉద్యోగంలో అధికారులు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. కొత్త కార్య క్రమాలకు శ్రీకారం చుడతారు. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థికంగా ఒత్తిడి పెరుగు తుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా, మెరుగ్గా ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థాన చలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితులు ఏర్పడతాయి. ప్రస్తుతానికి ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాలలో కూడా ఆర్థిక పురోగతి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలను చక్కబెడతారు. ముఖ్యమైన ఆర్థిక లావాదేవీల్లో జీవిత భాగ స్వామి సలహాలు తీసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినవారితో పరి చయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సకాలంలో, సానుకూలంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా ఆశించిన శుభవార్తలు వింటారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

రోజంతా కొద్దిగా భారంగా గడిచిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహకాలు అందుతాయి. అయితే, బరువు బాధ్యతల వల్ల శారీరక శ్రమ పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా, అనుకూలంగా ఉంటుంది. అద నపు ఆదాయ మార్గాల నుంచి ఆశించిన ఫలితాలు అందుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమాధిక్యత ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం నిలకడగా సాగిపో తుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాలు బాగా అనుకూలంగా సాగిపోతాయి. శుభవార్తలు వినడం, శుభ పరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహకారముంటుంది. వ్యాపారాలు లాభ సాటిగా ముందుకు సాగుతాయి. మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువుల ద్వారా పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. సతీమణికి బాగా కలిసి వస్తుంది.

Follow Us