AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackpot Luck: కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి జాక్‌పాట్ యోగం..!

శుక్ర, గురువుల శుభ సంయోగం, బుధ-శుక్రుల పరివర్తన యోగం, మేషంలో కుజుడి బలం కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశుల వారికి లాటరీ, షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా జాక్‌పాట్ స్థాయి ఆర్థిక లాభాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.

Jackpot Luck: కీలక గ్రహాల అనుకూలత.. ఈ రాశుల వారికి జాక్‌పాట్ యోగం..!
Juckpot Luck Zodiac Signs
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 20, 2026 | 4:30 PM

Share

అత్యంత శుభ గ్రహాలైన శుక్ర, గురువులు మిథున రాశిలో కలిసి ఉండడం, శుభ గ్రహాలైన బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం, కుజుడు తన స్వస్థానమైన మేష రాశిలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి లాటరీ యోగం పట్టే అవకాశం ఉంది. గురు, శుక్రులు ధనానికి, సుఖ సంతోషాలకు, ఆకస్మిక ధన లాభానికి కారకులు. శుభ గ్రహాలైన గురు, శుక్ర, బుధుల మధ్య సంబంధం ఏర్పడి నప్పుడు కొన్ని రాశుల వారి ఆర్థిక పరిస్థితి తప్పకుండా ఉచ్ఛ స్థితికి చేరుకుంటుంది. లాటరీ లేదా జాక్ పాట్ కొట్టడం, షేర్లు, స్పెక్యులేషన్లు కనక వర్షం కురిపించడం వంటివి జరుగుతాయి. వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, కుంభ రాశులవారు అపార ధన లాభం పొందే అవకాశం ఉంది.

  1. వృషభం: ఈ రాశిలోనూ, ధన స్థానంలోనూ శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన ప్రాప్తికి బాగా అవకాశం ఉంది. సుమారు 20 రోజుల కాలంలో తప్పకుండా లాటరీ రావడమో, జాక్ పాట్ కొట్టడమో జరుగుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందడంతో పాటు, ఆర్థిక లావాదేవీలు, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల విపరీతంగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు బాగా పెరుగుతాయి.
  2. మిథునం: ఈ రాశిలో గురు, శుక్రుల సంచారం, రాశ్యధిపతి బుధుడితో శుక్రుడికి పరివర్తన వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి తప్పకుండా గణనీయంగా మెరుగుపడుతుంది. ఒకటికి రెండుసార్లు ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. లాటరీ, జాక్ పాట్, షేర్లు, స్పెక్యులేషన్లు, వడ్డీ వ్యాపారాల వల్ల ఈ రాశి వారు తప్పకుండా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెందుతాయి.
  3. కన్య: రాశ్యధిపతి బుధుడు భాగ్య స్థానంలో సంచారం, దశమంలో శుక్ర, గురువుల యుతి వంటి కారణాల వల్ల ఈ రాశివారు జూన్ 15 లోగా తప్పకుండా సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. లాటరీలు, జాక్ పాట్లు, షేర్ల వల్ల ఈ రాశివారి ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. జీవిత భాగస్వామికి కూడా ఆకస్మిక ధన లాభానికి, లాటరీ రావడానికి అవకాశం ఉంది. అనేక వైపుల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది.
  4. తుల: రాశ్యధిపతి శుక్రుడు భాగ్య స్థానంలో గురువుతో కలిసి ఉండడం, ధనాధిపతి కుజుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తుండడం వల్ల ఈ రాశివారికి ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి పాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. మహా భాగ్య యోగం పట్టినందువల్ల లాటరీ, జాక్ పాట్, షేర్ల మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.
  5. మకరం: రాశ్యధిపతి శని తృతీయ స్థానంలో ఉండడం, ధన కారకుడు గురువు షష్ట స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం, బుధ, శుక్రులు పరివర్తన చెందడం వల్ల ఆదాయ వృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. రావలసిన డబ్బును రాబట్టుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద కొద్దిగా పెట్టుబడులు పెట్టినా అపార ధన లాభాలు కలుగుతాయి. లాటరీ వచ్చే అవకాశం ఉంది.
  6. కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్రులు యుతి చెందడం, బుధ, శుక్రుల మధ్య పరివర్తన జరగడం, తృతీయ స్థానంలో కుజు సంచారం వల్ల ధనాదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అపార ధన లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us