AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దిన ఫలాలు (మే 7, 2026): ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభ యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?

Horoscope Today: మే 7, 2026 గురువారం రాశిఫలాల ప్రకారం చాలా రాశుల వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలత, ఆదాయ వృద్ధి కనిపించే సూచనలు ఉన్నాయి. కొన్ని రాశుల వారికి అవకాశాలు, గుర్తింపు పెరుగుతుండగా, మరికొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొత్తంగా ఈ రోజు చాలా మందికి మిశ్రమ ఫలితాలతో పాటు పురోగతి దిశగా ముందుకు సాగే సూచనలు కనిపిస్తున్నాయి.

దిన ఫలాలు (మే 7, 2026): ఈ రాశుల వారికి ఉద్యోగంలో శుభ యోగం.. మీ రాశికి ఎలా ఉందంటే..?
Rashifal In Telugu 07 May 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2026 | 5:31 AM

Share

దిన ఫలాలు (మే 7, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ రోజు అవకాశాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. వృత్తి, వ్యాపారాలలో కీలక నిర్ణయాలు అమలు చే‍సి, లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. బంధుమిత్రులతో వివాదాలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆస్తి వివాదానికి సంబంధించి పితృవర్గం నుంచి శుభవార్త అందే సూచనలున్నాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అదనపు ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నా ఫలితం ఉంటుంది. కుటుంబంలో పిల్లలకు సంబంధించిన శుభకార్యం జరపడానికి అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులకు అవసరమైనప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. ప్రయాణాల్లో వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన అండదండలు లభిస్తాయి. సహోద్యోగులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. అనేక మార్గాల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఇష్టమైన బంధువులు ఇంటికి రావడం జరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలు చదువుల్లో పురోగతి చెందుతారు. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. అనుకోకుండా కొన్ని ఆర్థిక సమస్యలు పరిష్కారమై ఊరట చెందుతారు. బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులకు సహాయం చేయడం జరుగుతుంది. పిల్లల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు అప్రయత్నంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారాలు నిలకడగా లాభాలు ఆర్జిస్తాయి. వ్యక్తి గతంగా కొద్దిగా పురోగతి ఉంటుంది. సమాజంలో గౌరవాభిమానాలు పెరగడం, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం వంటివి జరుగుతాయి. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. కొన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు నిర్వర్తించాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లావాదేవీలు, కార్యకలాపాలు విస్తరిస్తాయి. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలోనూ, దైవ కార్యాల్లోనూ కాలం గడుపుతారు. శుభ కార్యాల మీద లేదా పుణ్య కార్యాల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. దాయాదులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధించే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించి ఒకటి రెండు సమస్యలను జీవిత భాగస్వామితో కలిసి పరి‌ష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. వ్యాపారాలు సజావుగా పురోగమిస్తాయి. ఆదాయానికి లోటుండదు. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సిన అవసరం ఉంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయంగా నిలబడతారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆదాయానికి లోటుండదు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అధికారులకు మీ సలహాలు, సూచనలు ప్రయోజనం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు వెడతాయి. ఉపయోగకరమైన పరిచయాలు ఏర్పడతాయి. కొందరు మిత్రులతో విందులో పాల్గొంటారు. స్థాన చలనానికి, స్థలం మార్పునకు అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

గృహ, వాహనాలకు సంబంధించిన ప్రయత్నాలు చాలావరకు సానుకూలపడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పనులు కూడా నిదానంగా పురోగమిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం కావచ్చు. ఆదాయ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రాదనుకుని వదిలేసుకున్న డబ్బు కూడా చేతికి అందుతుంది. కుటుంబ సభ్యులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం, పని ఒత్తిడి నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగుతాయి. స్నేహితులతో మంచి కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి ఆదరణ పెరుగుతుంది. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. కొందరు బంధువులు తప్పుదోవ పట్టించే సూచనలున్నాయి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపకరిస్తాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. మిత్రులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలుంటాయి. నిరుద్యోగులకు ఆశించిన సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యలను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలావరకు ఫలిస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. సామాజిక సేవా కార్య క్రమాల్లో విశేషంగా పాల్గొంటారు. ప్రయాణాల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఆరోగ్యం మీద బాగా శ్రద్ద పెట్టడం మంచిది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.)

Follow Us