Horoscope Today: వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (March 17, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

Horoscope Today: వారికి ఉద్యోగంలో మంచి గుర్తింపు.. 12 రాశుల వారికి రాశిఫలాలు
Daily Horoscope 17 March 2026

Edited By:

Updated on: Mar 17, 2026 | 5:31 AM

దిన ఫలాలు (మార్చి 17, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. వృషభ రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. మిథున రాశి వారికి ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

బుధ, గురు, కుజుల బలం అనుకూలంగా ఉన్నందువల్ల ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగులకు పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు. ఇంటి బాధ్యతలు పెరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. జీవిత భాగ స్వామితో కలిసి ఆలయ దర్శనం చేసుకుంటారు. ఆహార, విహారాల్లో కొద్ది జాగ్రత్తలు పాటించాలి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

రాశ్యధిపతి శుక్రుడు లాభ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాలతో సాగిపోతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. పెళ్లి సంబంధం కుదురుతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

శుక్ర, రవి, బుధ గ్రహాల సంచారం అనుకూలంగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక సమస్యల నుంచి కొద్దిగా ఊరట లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఊహించని విజయాలు సాధిస్తారు. కొద్ది ప్రయత్నంతో రావలసిన డబ్బు చేతికి అందుతుంది. బాకీలు, బకాయిలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఉద్యోగ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

భాగ్య స్థానంలో శుక్రుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. విలాస జీవితం గడుపుతారు. దాదాపు ప్రతి ప్రయత్నమూ నెరవేరుతుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. వ్యాపారాలు నిలకడగా ఉంటాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాల్లో కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది. వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. అదనపు ఆదాయ మార్గాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఇతరుల పనుల కంటే సొంత పనులకు ప్రాధాన్యం ఇవ్వడం ఉత్తమం. ఉద్యోగంలో కొద్దిపాటి ఒత్తిడి తప్పకపోవచ్చు. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తి చేస్తారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

సప్తమ శని ప్రభావం వల్ల కొన్ని పనులు, వ్యవహారాలు ఆలస్యంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు సకాలంలో అందకపోవచ్చు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఇంటా బయటా అను కూలతలు ఉంటాయి. ఆటంకాలు తొలగిపోతాయి. ఆదాయానికి లోటుండదు. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. వ్యాపారులకు శ్రమకు తగ్గ లాభాలు కనిపిస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. ఒకటి రెండు ముఖ్యమైన శుభవార్తలు వింటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

గురు, శుక్ర, శనులు బాగా అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా గౌరవమర్యాదలతో సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు, చేతకు ఎదురుండదు. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలు, సూచనల వల్ల లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అనవసర ఖర్చుల్ని తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. కొందరు మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల ఆదాయం క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా నిలకడగా సాగిపోతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. వృత్తి, ఉద్యో గాల్లో ఇతరుల బాధ్యతలను పంచుకోవాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిరాటంకంగా సాగిపోతాయి. కుటుంబసమేతంగా ఇష్టమైన దైవ దర్శనాలు చేసుకుంటారు. ఒకరిద్దరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

శుక్ర, కుజ, బుధ, గురు, రవులు అనుకూలంగా ఉన్నందువల్ల రోజంతా ఆశించిన విధంగా సాగి పోతుంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. అత్యవసర వ్యవహారాలు, పనులు విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరిగే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభ వార్తలు వింటారు. ఉద్యోగంలో పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని అనుకూల సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. పదోన్నతికి అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగుపడుతుంది. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఏలిన్నాటి శని కారణంగా కొద్దిపాటి అనారోగ్యాలకు, ఒత్తిడికి అవకాశం ఉంటుంది. ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా గడిచిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ముఖ్యమైన పనులు సజావుగా సాగిపోతాయి. కుటుంబ వ్యవహారాల్ని సంతృప్తికరంగా చక్కబెడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు చతుర్థంలో ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక సమస్యలు చాలావరకు సమసిపోతాయి. అనారోగ్యాలు, అనవసర ప్రయాణాలు కొద్దిగా ఇబ్బంది పెడతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. ఆర్థికంగా ఇతరులకు సాయపడే స్థితిలో ఉంటారు. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం పెట్టుకోవద్దు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి.

Follow Us