AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: వీరు వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే

రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్న కారణంగా అటు ఉద్యోగ జీవితం, ఇటు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృథా ఖర్చులుంటాయి.

Horoscope Today: వీరు వృథా ఖర్చులు తగ్గించుకుంటే మంచిది.. బుధవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే
Horoscope Today
TV9 Telugu Digital Desk
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 30, 2025 | 7:03 AM

Share

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ధన స్థానాధిపతి శుక్రుడు తృతీయంలో గురువుతో కలవడంవల్ల కుటుంబ జీవితం సుఖ సంతో షాలతో సాగిపోతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన అభివృద్ధి ఉంటుంది. ప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపా రాలు కలిసి వస్తాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. మనసులోని కోరికలు నెరవేరు తాయి. సమాజంలో  పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి.  ప్రతి ప్రయత్నమూ సఫలం అవుతుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

లాభ స్థానంలో శని, ధన స్థానంలో గురు, శుక్రులు ఉండడం వల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి లోటు ఉండకపోవచ్చు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ఆదరణ, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారాల్లో పోటీదార్లతో సమస్యలున్నా లాభా లకు లోటుండకపోవచ్చు. ఆకస్మిక అనారోగ్యాలకు అవకాశం ఉంది. కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

రాశిలో గురు, శుక్రులు కలిసి ఉండడంతో పాటు రాశినాథుడు బుధుడు ధన స్థానంలో రవితో కలిసి ఉండడం వల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగతి ఉండ వచ్చు. ఏ ప్రయత్నమైనా విజయవంతమవుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూటికి నూరు పాళ్లు సఫలమవుతాయి. సమర్థతకు, ప్రతిభకు, శ్రమకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులుం టాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఈ రాశిలో బుధ, రవులు, లాభ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఆదాయానికి లోటుండక పోవచ్చు. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. శరీరానికి విశ్రాంతి అవసరమనిపిస్తుంది.  కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలు ఉండవచ్చు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

అష్టమ శని కారణంగా ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉండడం, మధ్య మధ్య అదనపు బాధ్య తలు మీద పడడం వంటివి జరుగుతాయి. ప్రతి పనీ ఆలస్యం అవుతుంటుంది. లాభ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఆదాయానికి లోటుండదు. పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. అనవసర ఖర్చులు, ఆకస్మిక ప్రయాణాలు తప్పకపోవచ్చు. తోబుట్టువులతో ఆస్తి సమస్యలు సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది.ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

దశమ స్థానంలో గురు, శుక్రుల సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. జీత భత్యాలు బాగా పెరిగే అవకాశం ఉంది. రాశ్యధిపతి బుధుడు లాభ స్థానంలో రవితో కలిసి ఉన్నం దువల్ల ఆదాయ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. తండ్రి వైపు నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు పెరుగు తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. రుణ సమస్యలు తగ్గుతాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

రాశ్యధిపతి శుక్రుడితో భాగ్య స్థానంలో గురువు కలిసి ఉన్నందువల్ల ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ భద్రత, ఆర్థిక భద్రత కొనసాగుతాయి. దశమ స్థానంలో రవి, బుధులున్నందువల్ల ఉద్యోగంలో పదోన్నతికి బాగా అవ కాశం ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

రాశినాథుడైన కుజుడు లాభ స్థానంలో, బుధ, రవులు భాగ్య స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఉద్యోగంలో అధికార యోగం పట్టే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఏ పని తలపెట్టినా తప్పకుండా కార్యసిద్ధి, వ్యవహార జయం ఉంటాయి. ఆదాయ వృద్ధికి బాగా అవ కాశం ఉంది. తలపెట్టిన వ్యవహారాలన్నీ సజావుగా పూర్తవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కొద్దిగా డబ్బు నష్టం, వృథా ఖర్చులు తప్పకపోవచ్చు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

రాశ్యధిపతి గురువు సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి ఉండడం వల్ల రోజంతా సుఖ సంతోషాలతో గడిచిపోతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పురోగమనం ఉంటుంది. ఆశించిన శుభ వార్తలు వింటారు. ఆదాయ వృద్ధితో పాటు, కుటుంబ జీవితంలో అన్యోన్యత, సామరస్యం పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలి స్తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

రాశ్యధిపతి శని తృతీయంలో, రవి, బుధులు సప్తమంలో ఉన్నందువల్ల ధనాదాయానికి లోటుం డకపోవచ్చు. ముఖ్యమైన ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతో షాలు వృద్ధి చెందుతాయి. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ మీద ఆధారపడే అవకాశం ఉంది. పనిభారం పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో పురోగతి ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ఇబ్బందులుంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

భాగ్య స్థానంలో ఉన్న గురు, రాహువుల వల్ల ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో పెరుగుదల ఉంటుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. సప్తమ శని వల్ల విపరీతంగా ఒత్తిడి ఉంటుంది. ఇక ఈ రాశిలో ఉన్న కుజ, బుధుల వల్ల పట్టుదలగా ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టుకోవడం, వ్యక్తిగత సమస్యలు పరిష్కరించుకోవడం జరుగుతుంది. వ్యయ స్థానంలో ఉన్న రవి, శుక్రుల వల్ల అనవసర వ్యయం, అనవసర పరిచయాలు తప్పకపోవచ్చు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

రాశ్యధిపతి గురువు చతుర్థ స్థానంలో శుక్రుడితో కలిసి ఉన్న కారణంగా అటు ఉద్యోగ జీవితం, ఇటు కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటేమీ ఉండదు. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలుంటాయి. వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. వ్యయ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల వృథా ఖర్చులుంటాయి. వైద్య ఖర్చు లకు కూడా అవకాశం ఉంది. కొన్ని అవకాశాలు చేజారిపోతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.