Horoscope Today: వీరు మనసుకు దగ్గరైన వారితో సమయం ఎక్కువగా గడుపుతారు.. నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే?
Horoscope Today: ఈ రాశివారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో ముందడుగు పడుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామివారి దర్శించుకుంటే మంచిది.
మేషం
సమయస్ఫూర్తితో అనుకున్న పనులు సకాలంలో చేపడుతారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడుతుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. లక్ష్మీదేవిని పూజిస్తే శుభం కలుగుతుంది.
వృషభం
తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మవిశ్వాసంతో సమస్యలను అధిగమిస్తారు. కొందరి ప్రవర్తన మనసుకు బాధ కలిగిస్తుంది. కోపాన్ని తగ్గించుకుంటే మేలు. కుటుంబంలో సమస్యలు తలెత్తుతాయి. గోపూజ, సేవలు చేయడం వల్ల మంచే జరుగుతుంది.
మిథునం
కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు, సూచనలు తీసుకుంటారు. విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. ఇష్టదేవతా స్తోత్ర పారాయణం చేస్తే మంచిది.
కర్కాటకం
ముఖ్యమైన పనుల్లో బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఇష్ట దైవారాదన మాత్రం మానవద్దు.
సింహం
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో సానుకూల ఫలితాలు ఉన్నాయి. సమయస్ఫూర్తితో ఆలోచించి కొన్ని కీలక పనులు చక్కబెట్టుకుంటారు. ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణం చేయడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు.
కన్య
చేపట్టిన రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. ముఖ్యమైన పనుల్లో సన్నిహితుల సహకారం అందుతుంది. కీలక విషయాల్లో మనసాక్షికి ఓటెయ్యండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.
తుల చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. కుటుంబీకులు, బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీరామరక్షా స్తోత్రం పఠిస్తే మంచిది.
వృశ్చికం
భవిష్యత్ ప్రణాళికలను పక్కాగా అమలుచేస్తారు. మనసుకు దగ్గరైన వారితో కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన పనుల్లో సహనం కోల్పోకుండా తగ్గకుండా చూసుకోవాలి. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం వల్ల సానుకూల ఫలితాలు పొందుతారు.
ధనస్సు
చేపట్టిన పనుల్లో జాప్యం జరుగుతుంది. కుటుంబ బాధ్యతలు భుజాన పడతాయి. ముఖ్యమైన పనుల్లో అంచనాలు తప్పుతాయి. కీలక విషయాల్లో అజాగ్రత్త పనికి రాదు. ఆదిత్య హృదయం పఠించడం వల్ల మేలు జరుగుతుంది.
మకరం
ఈ రాశివారికి అదృష్టం వెన్నంటే ఉంటుంది. కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన పనుల్లో ముందడుగు పడుతుంది. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామివారి దర్శించుకుంటే మంచిది.
కుంభం
ఆలోచనల్లో స్థిరత్వం లోపిస్తుంది. ఇబ్బందులు పడతారు. కీలక విషయాలు, వ్యవహారల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభం కలుగుతుంది.
మీనం
చేపట్టిన పనులు సకాలంలో నెరవేరుతాయి. మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అధికారుల సహకారం అందుతుంది. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ఇష్టదైవారాధన మాత్రం మానవద్దు.
NOTE: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.