Horoscope Today: కార్తీక పౌర్ణమి చంద్రగ్రహణం వేళ ఏఏ రాశులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసా ?.. మంగళవారం రాశిఫలాలు..
ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ కలహాలకు తావీయొద్దు.
మేష రాశి.. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. శుభవార్త వింటారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అనారోగ్యబాధలతో బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
వృషభ రాశి.. ఈరోజు వీరు వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. రుణ ప్రయత్నాలు చేస్తారు.
మిథున రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి. రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశముంది.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త వహించడం మంచిది.విదేశయాన ప్రయత్నం సులభంగా నెరవేరుతుంది. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహరాశి.. ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. కుటుంబ కలహాలకు తావీయొద్దు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంది. పిల్లలతో జాగ్రత్త వహించుట మంచిది. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది.
కన్య రాశి.. ఈరోజు వీరు నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కళాకారులకు, మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
తుల రాశి.. ఈరోజు వీరు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక మానసిక ఆందోళన చెందుతారు. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. రుణప్రయత్నం ఫలిస్తుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ముఖ్యమైన కార్యాలు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
మకర రాశి.. ఈరోజు వీరుప్రతి పని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రుణప్రయత్నాలు చేస్తారు. ఇతరులచే గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేనందున మానసిక ఆందోళన చెందుతారు.
కుంభరాశి. ఈరోజు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లరాదు. అపకీర్తి రాకుండా జాగ్రత్తపడడం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరమేర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలెదురవుతాయి.
మీన రాశి.. ఈరోజు వీరు అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. శారీరక శ్రమతో పాటు మానసిక ఆందోళన తప్పదు. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం.