Horoscope Today: సోమవారం రాశిఫలాలు.. ఈ రాశుల వారు దైవ దర్శనం చేసుకుంటారు.. మానసిక ప్రశాంతత కలుగుతుంది..
ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
మేష రాశి.. ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకుంటారు.సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా బలపడుతారు. స్త్రీలు మనోలాసాన్ని పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
వృషభ రాశి.. ఈరోజు వీరు శుభవార్తలు వింటారు. సహనం వహించడం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వినోదాల్లో పాల్గొంటారు. రుణ ప్రయత్నాలు చేస్తారు. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేయాల్సి వస్తుంది. అనారోగ్య బాధలకు ఔషధసేవ అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో వారికి ఈరోజు మేలు జరుగుతుంది.
మిథున రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు.
కర్కాటక రాశి.. ఈరోజు వీరు నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడుతాయి.
సింహరాశి.. ఈరోజు వీరికి సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడుతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు.నూతన వ్యక్తులను నమ్మి మోసపోకూడదు. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి.
కన్య రాశి.. ఈరోజు వీరు ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
తుల రాశి.. ఈరోజు వీరువృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణప్రయత్నాలు చేయవలసి వస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రయత్నం మేరకు స్వల్ప లాభం ఉంటుంది.
వృశ్చిక రాశి.. ఈరోజు వీరు ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు.
ధనుస్సు రాశి.. ఈరోజు వీరు అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృథా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు.
మకర రాశి.. ఈరోజు వీరు కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది.
కుంభరాశి. ఈరోజు వీరు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు.
మీన రాశి.. ఈరోజు వీరు బంధు, మిత్రులు కలుస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం.ఆత్మీయుల సహాయ సహకారాలకోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాలి.