Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు లాభాల పంట.. ఆదివారం 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 21వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలను (Rashi Phalalu) తెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈ రాశి వ్యాపారస్తులకు లాభాల పంట.. ఆదివారం 12 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Surya Kala

|

Updated on: Aug 21, 2022 | 6:29 AM

Horoscope Today (21-08-2022): రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 21వ  తేదీ ) ఆదివారం రాశి ఫలాలను (Rashi Phalalu) తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు మానసికంగా ధైర్యంగా ఉండాలి. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల విషయంలో నిర్లక్ష్యం వద్దు. బుద్ధి బలంతో వ్యవహరించాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు అనవసర విషయాలతో కాలయాపన చేయవద్దు.  భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. మొదలుపెట్టిన పనులను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. శారీరకంగా అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండడం మేలు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులల్లో సక్సెస్ ను సొంతం చేసుకుంటారు. వృత్తి, విద్య, వ్యాపార రంగాల్లోని వారు ప్రతిభకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఇష్టమైనవారితో కాలం గడుపుతారు. 

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు ఉత్సాహంగా పనిచేయాల్సి ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉంటూ..  చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకుంటారు.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆనందాన్ని ఇచ్చే వార్తలను వింటారు. ఒత్తిడి పెరగకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే శుభఫలితాలను అందుకుంటారు.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు శుభవార్త వింటారు. సమయానికి తగిన సహాయం అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగంలోని వారు  అభివృద్ధికి సంబందించిన శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బుద్ధి బలంతో విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సహకారం లభిస్తుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురుకాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగులు ఒత్తిడిని తట్టుకోలేక అధికారుల దగ్గర ఇబ్బందులుపడతారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఆయా రంగాల్లోని వారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు.  కుటుంబంలో సంతోషం నెలకొంటుంది.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు వెళ్లారు. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలోని వారికి  అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కొన్ని సంఘటనలు మీ మనోధైర్యాన్ని పెంచుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)