AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 20వ  తేదీ ) శనివారం రాశి ఫలాలను (Rashi Phalalu) తెలుసుకుందాం..!

Horoscope Today: ఈరోజు ఈ రాశివారు ఇల్లు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Surya Kala
|

Updated on: Aug 20, 2022 | 6:29 AM

Share

Horoscope Today (20-08-2022): రోజులో ఏ పనులు మొదలు పెట్టాలన్నా.. మంచి, చెడుల గురించి ఆలోచిస్తారు. ఈ రోజు తమకు ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి  దినఫలాల( Daily Horoscope) వైపు దృష్టి సారిస్తారు. ఈ నేపథ్యంలో నేడు (ఆగస్టు 20వ  తేదీ ) శనివారం రాశి ఫలాలను (Rashi Phalalu) తెలుసుకుందాం..!

మేష రాశి: ఈ రాశివారు ఈరోజు ఆదాయానికి మించి ఖర్చులు చేస్తారు. బంధువులతో వాదనలకు దూరంగా ఉండడం మేలు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లోని వారు పట్టుదల , ఓర్పుతో పనిచేయాల్సి ఉంటుంది.

వృషభ రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  సంతోషముగా గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. భవిష్యత్ ప్రణాళికలను అమలు చేస్తారు. సొంత ఇంటి పనుల విషయంలో ముందుకు వెళ్తారు.

ఇవి కూడా చదవండి

మిధున రాశి: ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంలో విజయాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కీలక వ్యవహారాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు. మానసికంగా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: ఈరోజు ఈ రాశివారికి శుభకాలం. ప్రతిభకు తగిన ప్రశంసలను అందుకుంటారు. శుభవార్త ఆనందాన్ని ఇస్తుంది. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అధికారుల నుంచి ప్రశంసలను అందుకుంటారు.  

సింహ రాశి: ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనుల విషయంలో అధిక శ్రమ కలగకుండా చూసుకోవాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు.

కన్య రాశి: ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులల్లో ఆటంకాలు ఎదురుకాకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల సహకారం లభిస్తుంది. ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది.

తుల రాశి: ఈ రోజు ఈ రాశివారు శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. నిరుత్సాహ పరిచే వార్తలను వింటారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి: ఈరోజు ఈ రాశివారు నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకాలం. బంధులతో సంతోషముగా గడుపుతారు. వృత్తి, విద్య, వ్యాపార రంగంలోని వారు సమయానుకూలంగా ముందుకు సాగాల్సి ఉంటుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి.

ధనస్సు రాశి: ఈరోజు ఈ రాశివారు బంధువులతో ఆచితూచి వ్యవహారించాలి. ముఖ్యమైన సమస్య పరిష్కారం అవుతుంది. సమయానికి తగిన సహాయాన్ని అందుకుంటారు.

మకర రాశి: ఈరోజు ఈ రాశివారు బంధు,మిత్రుల సలహాలతో ముందుకు వెళ్లారు. కీలక వ్యవహారాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. బంధుమిత్రుల సలహాలు మేలు చేస్తాయి. చేపట్టే పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు.

కుంభ రాశి: ఈ రోజు ఈరాశివారు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు. ఆయా రంగాల్లోని వారు అభివృద్ధి దిశగా అడుగులు వేస్తారు.  కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసుకోవడం సరికాదు.

మీన రాశి: ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యులతో సమస్యలను ఎదుర్కొంటారు. చేపట్టిన పనులల్లో విజయం లభిస్తుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం శుభఫలితాలను అందుకుంటారు.  గోసేవ ఉత్తమ ఫలితం లభిస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Note: (రాశిఫలాలు అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)

Follow Us
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీకు ఎంత వస్తుందంటే..?
పీఎఫ్ వడ్డీ ఎలా లెక్కిస్తారు..? మీకు ఎంత వస్తుందంటే..?
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
ఐపీఎల్ 2026 ఆరంభం ఎప్పుడు? ఫైనల్ ఎక్కడ? క్లారిటీ వచ్చేసిందోచ్
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
అది ఒక మాస్టర్ క్లాస్.. ఇంద్రభవనంలా కూలీ నటుడి ఇల్లు..
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. త్వరలో మరో కొత్త పథకం
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
విశాఖ టూ హౌరా.. శ్రీకాకుళంలోనే ఆగిపోయిన HPCL గ్యాస్ గూడ్స్ రైలు..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
జస్ట్ 60 నిమిషాలు.! విశాఖ వాసులారా.. రయ్ రయ్‌మని జెట్ స్పీడ్..
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్డేట్.. చేయకుంటే మీకే లాస్‌!
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఈడెన్ గార్డెన్స్‌లో సెమీఫైనల్..కివీస్ 19ఏళ్ల పగ తీర్చుకుంటుందా ?
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఏపీలో మరో రెండు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్లు.. ఈ రూట్లోనే..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..
ఉదయాన్నే పెరుగులో దీన్ని కలిపి తింటే ఆ సమస్యలన్నీ చిటికెలో మాయం..