Horoscope Today: ఆ రాశి వారికి అదృష్టం వరిస్తుందట.. శుక్రవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

Rashi Phalalu (30 June 2023): భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకుని 12 రాశుల వారికి ఫలానా రోజు ఎలా ఉంటుందో జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు.

Horoscope Today: ఆ రాశి వారికి అదృష్టం వరిస్తుందట.. శుక్రవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Shaik Madar Saheb

Updated on: Jun 30, 2023 | 6:27 AM

Rashi Phalalu (30 June 2023): భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే తెలుసుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరిస్తుంటారు. గ్రహాల సంచారాన్ని పరిగణలోకి తీసుకుని 12 రాశుల వారికి ఫలానా రోజు ఎలా ఉంటుందో జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. మరి శుక్రవారం నాడు 12 రాశుల వారికి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఒకటి రెండు మంచి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగ పరంగా ప్రతి పని ప్రశాంతంగా సాగిపో తుంది. దైవ కార్యాలలో లేక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి జీవితం లో బాగా డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొద్ది ప్రయత్నంతో నిరుద్యోగ సమస్య వదిలిపోయే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తిగా అవుతాయి. ఉద్యోగం రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఉద్యోగ పరంగా కొద్దిగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది. ఒక కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. బంధువుల రాకపోకలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. ఉద్యోగంలో ఒత్తిడి, శ్రమ పెరుగుతాయి. ప్రత్యేక బాధ్యతలతో అవస్థలు పడడం జరుగుతుంది. ఆరోగ్యం పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యు లను సంప్రదించడం మంచిది. జీవిత భాగ స్వామితో అన్యోన్యత బాగా మెరుగుపడు తుంది. శుభవార్తలు వినే అవకాశం ఉంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): ఉద్యోగ జీవితం చాలా వరకు ప్రశాంతంగా సాగిపోతుంది. ఉద్యోగంలో ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అధికా రుల మెప్పు పొందుతారు. వృత్తి జీవితంలో ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థిక ప్రయత్నాలు తప్పకుండా సఫలం అవుతాయి. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): కొద్దిగా అదృష్టం కలిసి వస్తుంది. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. అవమాన పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. ఆహార నియమాలు పాటించడం మంచిది. వృత్తి, ఉద్యో గాల్లో ఒకటి రెండు సాధారణ సమస్యలు ఎదురు కావచ్చు. వ్యాపారం ఆశాజనకంగా ఉంటుంది. బందు వర్గంలో పెళ్లి సంబంధం వదిలే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.

కన్య రాశి: ఉద్యోగ జీవితం, ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. వృత్తి జీవితంలో కూడా సమస్యలేవీ ఉండకపోవచ్చు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆర్థిక ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవు తాయి. శుభవార్త శ్రవణానికి అవకాశం ఉంది. కుటుంబంలో జీవిత భాగస్వామితో అపార్ధాలు ఏర్పడవచ్చు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): కొన్ని ముఖ్యమైన వ్యక్తిగత పనులు పూర్తి అవుతాయి. గురువు అనుగ్రహం పూర్తిగా ఉన్నందువల్ల ఏ ప్రయత్నం తలపెట్టినప్పటికీ అది తప్పకుండా విజయవంతం అవుతుంది. ముఖ్య మైన వ్యక్తులతో పరిచయాలు పెంపొందుతాయి. ఆరోగ్యం చాలావరకు సహకరిస్తుంది. ఉద్యోగ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన స్థాయిలో అనుకూలంగా ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తి అవుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనుకోని ఖర్చులు మీద పడతాయి. ఉద్యో గంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా శ్రమ, తిప్పట తప్పకపోవచ్చు. డాక్టర్లకు, లాయర్లకు, ఐటి నిపుణులకు, ఇంజనీర్లకు బాగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు మరింతగా ముమ్మరం చేయాల్సి ఉంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అనుకోకుండా ఒక మంచి పరిణామం చోటు చేసు కుంటుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు వృద్ధి చెందుతాయి. కుటుంబ పరిస్థితి చాలా వరకు మెరుగుపడు తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణ లభిస్తుంది. మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది. ఎంత పాజిటివ్ గా వ్యవ హరిస్తే అంత మంచిది. అనుకున్న పనులు అను కున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) : వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వృత్తి జీవితానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆదాయం ఆశించిన దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. కుటుంబంలో సామరస్య వాతావరణం ఏర్పడు తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టడం మంచిది. రహస్య శత్రువులు ఉండే అవకాశం ఉంది. ఒకరిద్దరు ముఖ్యమైన స్నేహితులకు సహాయం చేస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): కుటుంబానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులు శ్రమతో పూర్తవుతాయి. వ్యక్తిగత సమ స్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకుం టారు. పొదుపు పాటిస్తారు. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. దీనివల్ల పెద్దగా ప్రతిఫలం ఉండకపోవచ్చు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు మెరుగుపడతాయి. శుభవార్త వినే అవకాశం ఉంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఉండకపో వచ్చు. ఉద్యోగంలో మాత్రం సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కొన్ని ముఖ్యమైన పనులు స్నేహితుల సహాయంతో పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. డబ్బు జాగ్రత్త.

Note: ఇక్కడ ఇచ్చిన సమాచారం వ్యక్తుల నమ్మకం, విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారాన్ని ఇక్కడ అందించాం..

మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..