Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూలమైన రోజు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 29, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ‌ృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గి ఊరట లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు అనుకూలమైన రోజు.. 12 రాశుల వారికి సోమవారం రాశిఫలాలు
Horoscope Today 29th April 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Apr 29, 2024 | 5:01 AM

దిన ఫలాలు (ఏప్రిల్ 29, 2024): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వ‌ృషభ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గి ఊరట లభిస్తుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులు మంచి ఉద్యోగంలోకి మారే అవకాశం కూడా ఉంది. డాక్టర్లు, లాయర్లు వంటి వృత్తుల వారికి డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యో గులకు ఆశించిన వర్తమానం అందుతుంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందల లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు స్థిరంగా కొనసాగుతాయి. ఆర్థిక వ్యవహారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాలు నష్టాల నుంచి బయటపడతాయి. చిన్నా చితకా సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయటా చాలావరకు అనుకూల వాతావరణం ఉంటుంది. సోదరులతో అపార్థాలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం పరవా లేదు.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి తగ్గి ఊరట లభిస్తుంది. సామాజికంగా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ముఖ్యమైన ప్రయత్నాల్లో విజ యాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఆశించిన శుభవార్త వింటారు. మంచి పరిచయాలు ఏర్పడ తాయి. ప్రయాణాల వల్ల లాభం పొందుతారు. శుభ కార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ముఖ్య మైన వ్యవహారాలు పూర్తవుతాయి. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో అధికారులతో అనుకూలతలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక ఒత్తిళ్లు తగ్గు తాయి. ఆర్థిక పరిస్థితి కొద్దిగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడం మంచిది. కొత్త ఉద్యోగ ప్రయత్నం సఫలం అవుతుంది. పెళ్లి ప్రయత్నాలు విసిగిస్తాయి. కుటుంబ పరిస్థితి ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. పిల్లలు చదువుల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా పొరపాట్లు దొర్లే అవకాశం ఉంది. చేపట్టిన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కొందరు బంధువులతో అపార్థాలు తలెత్తవచ్చు. కుటుంబ పరిస్థితులు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అంది వస్తాయి. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాలలో కొద్దిగా ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు మీ సలహాలు, సూచనలు స్వీక రిస్తారు. వృత్తి జీవితం సానుకూలంగా, ఆశాజనకంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో రాబడి పెరుగు తుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. కుటుంబ జీవితం చాలావరకు అనుకూ లంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. నిరుద్యోగులకు అవకాశాలు కలిసి వస్తాయి. మీ ప్రయత్నాలు, ఆలోచనలు, నిర్ణయాలు ఫలిస్తాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం బాగా పెరుగుతుంది. అధికారులు కొన్ని ప్రత్యేక బాధ్యతలు అప్పగి స్తారు. వృత్తి జీవితంలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారంలో లాభాలపరంగా పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి అవుతాయి. కుటుంబ పరిస్థితులు ఉత్సా హంగా సాగిపోతాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి ఉంటుంది. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆదాయ వృద్ధికి కూడా అవకాశముంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. ఉద్యోగ జీవితం సాధారణంగా సాగిపో తుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. కుటుంబ పరిస్థితులు ప్రశాంతంగా ఉంటాయి. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడ తాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇరుగు పొరుగుతో చికాకులుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సిద్ధిస్తుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో అవరోధాలు తొలగిపోతాయి. పట్టుదలగా పెళ్లి ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఆధ్యా త్మిక చింతన పెరుగుతుంది. ఇంటా బయటా బాగా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. అధికారులు అతిగా ఉపయోగించుకుంటారు. వ్యాపా రాల్లో లాభాలు నిలకడగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు సహాయం చేయగల పరిస్థితిలో ఉంటారు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రస్తుతానికి ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కుటుంబ వాతావరణం ప్రశాం తంగా ఉంటుంది. బంధువుల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతాయి. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగం జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించిన ధన లాభం పొందుతారు. ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. తల్లితండ్రుల సహాయంతో ఆస్తి వివాదం ఒక కొలిక్కి వస్తుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం అవసరం. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందుతారు. కొద్ది వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన వ్యవ హారాలు పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభాలు పొందుతారు. ఆశించిన శుభవార్త వింటారు.