Horoscope Today: వారికి అనేక వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు

Today Horoscope (November 25, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులు సోమవారంనాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశముంది. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం పొందే అవకాశముంది. మిథున రాశి వారికి అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి అనేక వైపుల నుంచి ఆదాయం.. 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు
Horoscope Today 25 November 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 25, 2024 | 5:01 AM

దిన ఫలాలు (నవంబర్ 25, 2024): మేష రాశికి చెందిన నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృషభ రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి సోమవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో అనుకూల పరిస్థితులుంటాయి. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. నిరుద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. పెళ్లి ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆర్థిక లావాదేవీలు, కార్యకలాపాలు బాగా విస్తరిస్తాయి. ఉద్యోగంలో పని భారం కాస్తంత ఎక్కువగానే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత ఆలోచనల వల్ల లాభం ఉంటుంది. బంధువులతో కలిసి ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. రావలసిన డబ్బు వసూలవుతుంది. ఆస్తి వివాదం నుంచి విముక్తి లభిస్తుంది. ఇంటా బయటా గౌరవాభిమానాలు పెరుగుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ రోజంతా సంతృప్తికరంగా సాగిపోతుంది. ముఖ్యంగా అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తయి ఊరట చెందుతారు. ఉద్యోగం జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు కొన్ని కష్టనష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం ఉంది. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవాభిమానాలు పెరుగుతాయి. బంధు మిత్రులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. అనేక వైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారం లభించే అవకాశముంది. వ్యాపారాలలో లాభాలకు లోటుండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు బంధువుల సహాయం లభిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. చిన్నా చితకా సమస్యలు సర్దు మణుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తిపరంగా క్షణం కూడా తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వ్యక్తిగత విష యాలను ఇతరులతో పంచుకోకపోవడం మంచిది. ప్రయాణాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, వ్యాపారాల్లో ఆటుపోట్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఉద్యోగంలో ఆశించిన పురోగతి సాధిస్తారు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆశించిన పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల్లో అధిక లాభం పొందుతారు. నిరుద్యోగులకు మంచి అవకాశం లభిస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి.

తుల (చిత్త 3,4,స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో మీ మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొందరు దగ్గర బంధువుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో బిజీ జీవితం ఏర్పడుతుంది. కొందరు ప్రముఖులతో లాభదాయక సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలను కొద్ది శ్రమతో పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్య క్రమాల్లో ఎక్కువగా పాల్గొనే అవకాశం ఉంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల్ని పరిష్కరించుకుం టారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, వ్యాపారాల్లో కొన్ని ఆర్థిక సమస్యల నుంచి అనుకోకుండా బయటపడతారు. ఆశించిన స్థాయిలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రులతో విభేదాలు పరిష్కారమై, సాన్ని హిత్యం పెరుగుతుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆస్తి వివాదానికి పరిష్కారం లభించవచ్చు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు వ్యక్తిగత సమ స్యలు పరిష్కారం అవుతాయి. పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. ధన పరంగా వాగ్దానాలు చేయవద్దు. మిత్రులతో వివాదాలు ఉత్పన్నమవుతాయి. ఆరోగ్యం పరవాలేదు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

వృత్తి, వ్యాపారాల్లో కీలక మార్పులు చేపడతారు. ఉద్యోగులు ఒకటి రెండు శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు, వ్యవహా రాలు సకాలంలో పూర్తవుతాయి. పెళ్లి సంబంధం విషయంలో బంధుమిత్రుల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు సందర్శిస్తారు. ఆదాయం నిలకడగా సాగు తుంది. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం కావచ్చు. ఆరోగ్యం బాగా అనుకూలంగా ఉంటుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

ఉద్యోగాలలో మీ పనితీరుతో అధికారులు సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు అందుకుంటారు. కుటుంబపరంగా బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రం సంద ర్శిస్తారు. నిరుద్యోగులు ఒకటి రెండు సానుకూల వార్తలు వింటారు. ఆదాయం కొద్దిగా పెరిగే అవ కాశం ఉంది. పిల్లల్లో చదువుల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారులు మీ మాటకు విలువనిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగానే పెరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆదాయ మార్గాలు విస్తరించే అవకాశం ఉంది. సామాజికంగా ప్రాధాన్యం పెరిగి తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండడం మంచిది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
కొత్త ఏడాది కిక్కోకిక్కు.. ఒక్క రాత్రిలో రూ.402కోట్ల మద్యం హాంఫట్
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ పై స్పెషల్ అప్డేట్..
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
హిట్‌మ్యాన్‌తో ఆ నలుగురు.. ఇక క్రికెట్‌కు గుడ్‌బై.!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
కామాంధుడికి తగిన శిక్ష విధించిన కోర్టు..!
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
క్రాకర్ కాల్చి న్యూ ఇయర్‌కు స్వాగతం చెప్పాలనుకున్నాడు.. చివరకు..
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
ఒక్కరాత్రిలో 16 సార్లు న్యూ ఇయర్‌ చూసిన సునీత విలియమ్స్‌.. ఫొటోలు
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
మీ మాట భారంగా, బొంగురుగా వస్తుందా.. ఈ ఇంటి చిట్కాలు ట్రై చేయండి
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
సింగర్ శివశ్రీని పెళ్లాడబోతున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య..
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
స్కంద షష్ఠి రోజున ఇలా కార్తికేయుడిని పూజించండి కోరిక నెరవేరుతుంది
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
ఇదేం భక్తిరా బాబూ.! అందరూ గుడికి మొక్కేందుకు వెళ్తే..
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా.? జాగ్రత్త.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
మొన్న చెయ్యి.. ఇవాళ కాలు.. ఇడుపులపాయలో వింత పుట్టగొడుగులు.!
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
సముద్రం ఒడ్డున బంగారం తెచ్చుకున్నోళ్లకు తెచ్చుకున్నంత.! వీడియో..
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
డేటా యూజర్లకు జియో షాక్‌.! డేటా ప్యాక్‌ల వ్యాలిడిటీని తగ్గించిందా
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఏపీలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం క్లారిటీ.! ఇన్ని రోజులా..
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
ఆలయ హుండీ లెక్కింపు.. రూ.20 నోటుపై రాసింది చూసి అందరూ షాక్.!
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
మల్లారెడ్డి సిక్స్ ప్యాక్.? ఏడు పదుల వయసులో జిమ్‌.. వీడియో వైరల్.
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
హెల్మెట్‌లో దూరి.. కాటేసిన పాము.! గుండె గుబేల్ అనిపించే వీడియో..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..
భీకర అలల తాకిడికి మునిగిన నౌక.! కాపాడాలంటూ అత్యవసర సందేశం..