Horoscope Today: రాశి ఫలాలు.. చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది..!
Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు..
Today Horoscope: ముందు వెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో చాలాసార్లు ఇబ్బందుల్లో పడుతుంటాం. అందుకే కొత్త పనులను మొదలు పెట్టాలన్నా, శుభకార్యాలు నిర్వహించాలన్నా.. జాతకాలు, రాశిఫలాలను అనుసరించేవారు చాలామంది ఉన్నారు. మంగళవారం (నవంబర్ 23న ) రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి: వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలకు పరిస్థితులు అనుకూలంగా ఉంటుంది. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గో సేవ చేయడం వల్ల మంచి జరుగుతుంది.
వృషభ రాశి: ఈ రాశివారు చేపట్టే పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. గిట్టనివారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
మిథున రాశి: చేపట్టే పనులలో పురోగతి లభిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగులకు మంచి అవకాశాలు. సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు.
కర్కాటక రాశి: శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. చేపట్టే పనులలో ఆలోచంచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.
సింహరాశి: ఆశించిన ఫలితాలు ఉంటాయి. దూర ప్రాంతాల నుంచి శుభ వార్త అందుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఉంటాయి.
కన్య రాశి: వృత్తి, వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. చేపట్టే పనులన్ని విజయవంతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దక్కే అవకాశం ఉంటుంది.
తుల రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. గిట్టని వారితో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాలలో మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి: కొన్ని పనులు చేపట్టే ముందు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి.
ధనుస్సు రాశి: మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఒక శుభవార్తను అందుకుంటారు. ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకుంటారు.
మకర రాశి: అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో ప్రేమగా వ్యవహరించాలి. ధైర్యంతో ముందుకెళితే మంచి అవకాశాలు ఉంటాయి.
కుంభ రాశి: మనసు పెట్టి పనులను చేపడితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం. ప్రయాణాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.
మీన రాశి: శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. కొన్ని విషయాలు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. అవనసరమైన ఖర్చులు పెరుగుతాయి.
ఇవి కూడా చదవండి: