Horoscope Today: షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు.. నిరుద్యోగులకు ఉద్యోగాలు.. ఈరోజు రాశిఫలాలు..
Horoscope Today March 20th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే
Horoscope Today March 20th 2021: ప్రస్తుత కాలంలో రాశిఫలాలను విశ్వసించేవాళ్లు అనేకం. ఉదయాన్నే తమ భవిష్యత్ రోజులో జరిగే విషయాలను ముందుగానే తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈరోజు మార్చి 20 శనివారం నాడు చంద్రుడు రోహిణిలో సంచరించనున్నాడు. సాయంత్రం నుంచి రోహిణిలో ప్రవేశించనున్నాడు. అంగారకుడు కూడా చంద్రుడితో పాటు ఈ నక్షత్రంలో ఉండనున్నాడు. ఈరోజు మేషరాశి నుంచి మీన రాశి వరకు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి..
ఈరోజు ఈరాశి వారికి రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి. జాగ్రత్తగా వాటిని వసూలు చేసుకోవాలి. ఈరోజు వీరికి మహాశివుని దర్శనం మేలు చేస్తుంది.
వృషభ రాశి..
ఈరోజు వీరు ఆద్యాత్మక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. షేర్లు, పెట్టుబడుల విషయంలో తొందరపడకూడదు. ఈరోజు అష్టలక్ష్మీ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
మిధున రాశి..
ఈరోజు వీరు చేపట్టిన పనులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆధారాభిమానాలు పెరుగుతుంటాయి. ఈరోజు వీరికి నవగ్రహ స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కర్కాటక రాశి..
ఈరోజు వీరికి శ్రమ పెరుగుతుంది. ఫలితాలు ఆలస్యం అవుతాయి. అలాగే ఎదురుచూసే దోరణి ఎక్కువ అవుతుంది. శ్రీకృష్ణుడిని తులసి దలంతో అర్చించుకోవడం మంచిది.
సింహరాశి..
ఈరోజు వీరికి పనుల్లో ప్రతి బంధకాలు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత అవసరాల కోసం అప్పులు చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు వీరు పేదవారికి అన్నదానం చేసుకోవడం మంచిది.
కన్యరాశి..
ఈరోజు వీరికి ఆర్థిక లావాదేవిలు ఆలస్యం అవుతాయి. జాగ్రత్తగా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. ఈరోజు వీరికి హానుమాన్ చాలిసా మేలు చేస్తుంది.
తులరాశి..
ఈరోజు వీరికి పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో సఖ్యత ఉండాలి. ఈరోజు వీరు మహాలక్ష్మీ అమ్మవారికి తీపి పదార్థాల నివేదించుకోవాలి.
వృశ్చిక రాశి..
ఈరోజు వీరికి సంఘంలో కొన్ని పనుల్లో ఇబ్బందులు చోటుచేసుకుంటాయి. చేసే ఆలోచనల్లో కొన్ని కార్యరూపం దాల్చేందుకు శ్రద్ద తీసుకోవాలి. ఈరోజు వీరికి మహాగణపతి దర్శనం, అర్చన మేలు చేస్తుంది.
ధనుస్సు రాశి..
ఈరోజు వీరికి ఉద్యోగ లాభాలు కలుగుతాయి. నూతన పరిచయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు వీరు ఆవుపాలతో శివుడికి అభిషేకం చేయడం మంచింది.
మకర రాశి..
ఈరోజు ఆద్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు వీరికి ఆదిత్య స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు వీరికి వ్యవహరిక విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. శుభకార్యక్రమాలు నిర్వహించుకుంటారు. అలాగే ఒప్పంద విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు విష్ణు సహస్రనామా స్త్రోత్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే పేదవారికి కాయగూరలు దానం చేయడం మంచిది.
మీన రాశి..
ఈరోజు ఈ రాశి నిరుద్యోగులకు తమ ఉద్యోగ ప్రయత్నాలను మరింత పెంచేందుకు మంచి సమయం. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సుదర్శన స్వామి శతకం పారాయణం చేయడం మంచిది.
Also Read:
Swaeroes IPS Praveen Kumar : దేశంలో హిందూ, నాన్ హిందూ విభజన రేఖలు పెరుగుతున్నాయి : ప్రవీణ్‌కుమార్