Horoscope Today: ఆ రాశుల వారు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.. ఆదివారం రాశిఫలాలు..
Rasi Phalalu Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి

Rasi Phalalu Today: మనం ముందువెనుక ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలతో కొన్ని జీవితాలు చిన్నాభిన్నం అవుతుంటాయి. కావున తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ, చేపట్టే ప్రతీ కార్యక్రమంలోనూ ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదివారం ముఖ్యంగా పలు రాశుల వారికి పరిస్థితులు అనుకూలంగా లేవు. మరికొన్ని రాశుల వారికి పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయి. అయితే.. అసలు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు కలగనున్నాయో.. ఓ సారి పరిశీలిద్దాం.
మేష రాశి: ఈ రోజు ఈ రాశివారికి అన్ని కార్యక్రమాల్లో ఆశాజనక ఫలితాలు ఉంటాయి. ఈ రోజు శుభవార్తలు వినే అవకాశముంది. గౌరవ, మర్యాదలు కూడా అధికంగా ఉంటాయి. అభివృద్ధితోపాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలు ఉన్నా సత్ఫలితాలు పొందే అవకాశముంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, వ్యాపార విషయాల్లో తొందరపాటు తగదు. ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం వేచిచూస్తుంటారు.
మిథున రాశి: ఈ రాశి వారు బంధువులు, మిత్రులతో విరోధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని అనారోగ్య బాధలు కలిగే అవకాశముంది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది కావున జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
కర్కాటక రాశి: ఈ రోజు నూతన వస్తు, వాహన, ఆభరణ, లాభాలను పొందే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభయోగానికి అవకాశం ఉంటుంది. శుభవార్తలు అందుకోవడంతోపాటు.. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
సింహ రాశి: విదేశయాన ప్రయత్నాలు అనుకూలించే అవకాశం ఉంది. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అనారోగ్య ఇబ్బందులు అధికమవుతాయి. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
కన్య రాశి: ఈ రోజు ఈ రాశివారు తీసుకునే కార్యక్రమాలకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధంతోపాటు.. కొన్ని విషయాలు మనస్తాపానికి గురిచేస్తాయి. ఆలోచనలు వేధిస్తుంటాయి.
తుల రాశి: ఈ రాశి వారు శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలు అందుకోవడంతోపాటు.. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తలు అవసరం.
వృశ్చిక రాశి: ఈ రాశివారు వృత్తి సంబంధిత ఇబ్బందులను అధిగమిస్తారు. కొన్ని సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశముంది. నిరుత్సాహాన్ని వీడి కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
ధనుస్సు రాశి: కుటుంబ పరిస్థితులు కొంత సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. ఆత్మీయుల సహాయసహకారాల కోసం సమయం వెచ్చించాల్సి వస్తుంది. కార్యక్రమాలను వాయిదా వేయడం మంచిది.
మకర రాశి: ఈ రాశి వారు శుభ వార్తలు వినే అవకాశముంది. దైవ చింతనతోపాటు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.
కుంభ రాశి: కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. వాయిదా వేసిన పనులు ఈ రోజు పూర్తి అయ్యే అవకాశముంది. ముఖ్యమైన కొంతమంది వ్యక్తులను కలుస్తారు.
మీన రాశి: కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉండటంతోపాటు.. పలు కార్యక్రమాల్లో ఫలితం ఉంటుంది. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. పలు మార్పులు కలిగే అవకాశముంది. బంధు, మిత్రులతో విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
Also Read: