Horoscope Today: ఈరోజు వారికి కుటుంబ సమస్యలు తగ్గుతాయి.. బాకీలను రాబట్టుకుంటారు..
Horoscope Today: ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది
Horoscope Today: ఇప్పటికీ రాశి ఫలాలను విశ్వసించి.. తమ రోజును ప్రారంభించేవారు చాలా మందే ఉన్నారు. ఈరోజున ఏం జరగబోతుందనేది ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటుంటారు. అందుకోసం రాశిఫలాలను నమ్ముతుంటారు. ఈరోజు మార్చి 11 గురువారం బుధుడు, చంద్రుడు కంభరాశిలో ఉండనున్నాడు. అలాగే ఈరోజు మేషం నుంచి మీనం వరకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేషరాశి..
ఈరోజు ఈ రాశివారు చేసే పనులలో సవాల్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగాలు, వ్యాపారస్తుల ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాడు. పరమేశ్వరుని ఆరాధన మేలు చేస్తుంది.
వృషభరాశి..
ఈ రోజు వీరికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వ్యక్తిగత జీవితంలో కొన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. రావాల్సిన బాకీలు ఈరోజు మీరు అందుకునే అవకాశం ఉంది. మహాలక్ష్మీ అమ్మవారి అర్చన మేలు చేస్తుంది.
మిధునరాశి..
ఈరోజు ఈరాశి వ్యాపారస్తులకు ఆశజనక ఫలితాలను అందుకోనున్నారు. ఉద్యోగులకు పదోన్నతలు లభించే అవకాశాలున్నాయి. మహాలక్ష్మీ అమ్మవారికి గులాబీ పూవ్వులతో అర్చన చేయడం మంచిది.
కర్కాటక రాశి..
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాల పట్ల జాగ్రత్తలు అవసరం. సంఘంలో ఇతరులతో వ్యవహరించే సమయంలో తొందరపాటు ఉండకూడదు. ఈరోజున సుబ్రమణ్య స్వామి భుజంగా స్త్రోత్రం మంచిది.
సింహరాశి..
ఈరోజు వీరు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. నూతన పరిచయాలు ఏర్పడే అవకాశాలున్నాయి. ఈరోజు శివాభిషేకం మేలు చేస్తుంది.
కన్యరాశి..
ఈరోజున మీరు ఆద్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోనే సూచనలు కనిపిస్తున్నారు. పెద్దవారికి సహయ చేయడం మంచిది. అనవసర ఖర్చులను తగ్గించడం ఉత్తమం. ఈరోజు గణపతి స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
తుల రాశి..
ఈ రోజున చేపట్టినపనులలో ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కోంటారు. ఈరోజున శ్రీవెంకటేశ్వర ఆరాధన మేలు చేస్తుంది.
వృశ్చిక రాశి..
వ్యాపారస్థులు, ఉద్యోగులకు పని ఒత్తిడి అధికమవుతుంది. చేపట్టినటువంటి పనులలో విజయం సాధించడానికి శ్రమించాల్సిన వస్తుంది. ఈరోజున ఆదిత్య స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
ధనస్సు రాశి..
ఈరోజు వీరికి శుభఫలితాలను పొందే సూచనలు ఉన్నాయి. ఆర్థికాభివృద్ధి.. రావాల్సినటువంటి బాకీలు అందుతాయి. ఈరోజున లలిత అమ్మవారి ఆరాధన మేలు చేస్తుంది.
మకర రాశి..
ఈరోజున మీరు ఆద్యాత్మిక, దైవ చింతన కార్యాక్రమాల్లో పాల్గోంటారు. ఉద్యోగులకు.. కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి సహయసహాకరాలు అందుకుంటారు. ఈరోజు రాజామతాంగై నమః స్త్రోత్రం మేలు చేస్తుంది.
కుంభరాశి..
ఈరోజు మీరు చేపట్టినటువంటి పనుల్లో విజయం పొందుతారు. కుటుంబంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. ఈరోజు పేదవారికి అన్నదానం నిర్వహించడం మంచిది.
మీనరాశి..
ఈరోజు వీరు ఉత్సహకంగా ఉంటారు. నూతన ఆదాయ మార్గాలను కనుగొంటారు. అలాగే కుటుంబ సమస్యలను నివారిస్తారు. నవగ్రహ స్త్రోత్ర పరాయణం మేలు చేస్తుంది.
Also Read: