AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Born on Tuesday: మంగళవారం జన్మించిన వ్యక్తుల్లో రాజసం, నాయకత్వ లక్షణాలు అధికం.. ప్రేమ, వృత్తి ఎలా ఉంటాయంటే?

వారంలో మూడో రోజు మంగళవారం. ఈ రోజు అధిపతి అంగారక గ్రహం. భూమికి దగ్గరగా ఉండే గ్రాహం అంగారకుడు.. కనుక మంగళవారం జన్మించిన వ్యక్తి ఎక్కువ ప్రభావితమవుతాడు. మంగళవారం జన్మించిన వారు పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు.

Born on Tuesday: మంగళవారం జన్మించిన వ్యక్తుల్లో రాజసం, నాయకత్వ లక్షణాలు అధికం.. ప్రేమ, వృత్తి ఎలా ఉంటాయంటే?
Born On Tuesday
Surya Kala
|

Updated on: Apr 11, 2023 | 8:56 AM

Share

మనిషి జన్మించిన సమయం, తేదీ, ప్రాంతం బట్టి అతని భవిష్యత్ ను , వ్యక్తిత్వాన్ని అంచనావేస్తారు. జ్యోతిష్యశాస్త్రంలో ఏ వారంలో జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం ఎలా ఉంటుందో.? ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో చెబుతారు. అయితే జన్మించిన వారం ఆధారంగా జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వాన్ని చెబుతారు. ఈ రోజు మంగళవారం రోజున పుట్టిన వ్యక్తుల వ్యక్తిత్వం, ప్రేమ పెళ్లి జీవన విధానం గురించి తెలుసుకుందాం..

వారంలో మూడో రోజు మంగళవారం. ఈ రోజు అధిపతి అంగారక గ్రహం. భూమికి దగ్గరగా ఉండే గ్రాహం అంగారకుడు.. కనుక మంగళవారం జన్మించిన వ్యక్తి ఎక్కువ ప్రభావితమవుతాడు. మంగళవారం జన్మించిన వారు పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. గెలవాలనే కోరికతో జీవితంలో ముందుకు వెళ్లారు. మండుతున్న, చురుకైన స్వభావం, ఉత్సాహం, చురుకుదనం, శక్తి, ధైర్యం, అసహనం వీరి ముఖ్య లక్షణాలు. విజయం సాధించడానికి ప్రయత్నించినా అధిక ఒత్తడికి గురవుతారు.

మంగళవారం జన్మించిన వ్యక్తుల వ్యక్తిత్వం అంగారక గ్రహం ప్రభావంతో మంగళవారం జన్మించినవారు చాలా శక్తితో నిండి ఉంటారు. సవాళ్లను ఎదుర్కోవడానికి, సామర్థ్యాన్ని  నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. తమ జీవితాంతంలో ముఖ్యమైన ప్రాజెక్ట్‌లు, మిషన్‌లతో చురుకుగా పాల్గొంటారు. బలమైన స్ఫూర్తితో ముందుకు వెళ్లారు. బలమైన ఆలోచనలు కలిగి ఉంటారు.  తమకు తెలియని రంగాల గురించి అన్వేషించడానికి,  ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తారు. మంగళవారం రోజున పుట్టిన వ్యక్తుల అదృష్ట సంఖ్య తొమ్మిది. దురదృష్టాన్ని, విజయాన్ని సొంతం చేసుకోవడానికి మంగళవారం దానధర్మాలు చేయండి.

ఇవి కూడా చదవండి

మంగళవారం జన్మించిన వ్యక్తుల వృత్తి జీవితం స్వభావం ప్రకారం..  వస్తువులను ప్రేమిస్తారు.. జీవితంలో వాటిని అత్యంత విలువైనవిగా భావిస్తారు. అంతేకాదు బ్యాంకింగ్ , ఫైనాన్స్ వంటి డబ్బు సంబంధిత రంగాలతో పని చేయడాన్ని ఆనందిస్తారు. కెరీర్ లో రిస్క్ తీసుకోవడం, విలువను నిరూపించుకోవడాన్ని  ఇష్టపడతారు. భారీ టర్నోవర్‌తో కూడిన కెరీర్‌ వీరికి బాగా సరిపోతాయి. కష్టపడి పని చేస్తారు. ఇతరులు వీరిని చూసి నేర్చుకోవాలని అనే భావనను చాలా సులభంగా కలిగించగలరు. వీరి కెరీర్ లో ఒక ప్రతికూలత ఏమిటంటే.. మాటను మాట్లాడే ముందు కలిగే ఫలితాల గురించి ఆలోచించరు. వీరి మాట తీరుతో ఇతరులను బాధపెడతారు. అంతేకాదు ఇతరులు మిమ్మల్ని ఇష్టపడకుండా చేసుకుంటారు. కాబట్టి మీరు ఇతరుల హృదయాన్ని గెలుచుకోవడానికి వీరు సున్నితంగా మాట్లాడే కళను నేర్చుకోవాలి. మీరు చాలా సున్నిత మనస్కులు. ఇతరులు వీరిని విమర్శించినప్పుడు సులభంగా గాయపడతారు. బ్యాలెన్స్‌ని పెంపొందించుకోవడం మీ కెరీర్‌లో విజయం సాధించడానికి ఒక మార్గం.

మంగళవారం జన్మించిన వ్యక్తుల ప్రేమ చాలా సార్లు వీరు ఆందోళన చెందుతారు. ముడుచుకుపోతారు. లోతైన ఆలోచనలలో మునిగిపోతారు. దీంతో వీరు ఇతరులతో కనెక్ట్ అవ్వడం కష్టం. వీరు ప్రేమించడానికి..  పరిపక్వత , అవగాహనను పెంపొందించుకోవడానికి భాగస్వామి భావోద్వేగ అవసరాలను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు.. మనసులో ఏది అనిపిస్తే అది అక్కడ ఉన్న పరిస్థితులను పట్టించుకోకుండా మాట్లాడేస్తారు. ఈ స్వభావంతో జీవిత భాగస్వామి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కనుక మాట్లాడే ముందు రెండు మూడు సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. విభిన్న దృక్కోణాల నుండి జీవిత సమస్యలను చూడాల్సి ఉంది. వీరి వ్యక్తిత్వం వీరి ప్రేమ భాగస్వామికి మధ్య సామరస్యాన్ని, మంచి అవగాహనను కొనసాగించేలా చేస్తుంది.

మంగళవారం జన్మించిన వ్యక్తుల వివాహం ప్రశాంతమైన వైవాహిక జీవితం విషయానికి వస్తే అసహనం, తీవ్రంగా స్పందించే స్వభావాలు వీరి శత్రువులు. అయితే జీవిత భాగస్వామికి భరోసానిస్తారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా కాపాడతారు. అయితే.. వీరి ఒత్తిడి స్వభావం సంబంధాలలో శాంతి,  సామరస్యాన్ని చెడగొట్టేలా చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా వాగ్వాదం చోటు చేసుకుంటే.. వెంటనే మాట్లాడకుండా.. కొంత సమయం వేచి చూడండి. అంతేకాదు మాట్లాడే ముందు బాగా ఆలోచించండి. నోరు జారితే ఎన్నడూ తిరిగి తీసుకోలేమని గుర్తుంచుకోండి. శ్రద్ధతో మీ వైవాహిక జీవితాన్ని సాఫీగా, ప్రేమ ప్రయాణంగా మార్చుకోవచ్చు. పాలించడం, నడిపించడం ఈ వారంలో జన్మించిన వారి సహజ ధోరణి అయితే.. ఇంట్లో సామరస్యాన్ని నిర్ధారించడానికి మీ జీవిత భాగస్వామికి సమాన హోదా ఇవ్వండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)