AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 30 రాశిఫలాలు: ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్

Horoscope Today (October 30, 2026): శుక్రవారం మేష రాశి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉండగా, మిథున రాశి వారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మరి మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

అక్టోబర్ 30 రాశిఫలాలు:  ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
Horoscope Today 30 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 30, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 30, 2026): మేష రాశికి చెందిన నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృషభ రాశికి చెందిన నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మిథున రాశి వారికి ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

మంచి పరిచయాలు కలుగుతాయి. విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు కొత్త ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా పురోగమిస్తాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. దైవ కార్యాల మీదా, శుభకార్యాల మీదా బాగా ఖర్చు చేస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలకు అనుకోని పరిష్కారం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. చిన్ననాటి మిత్రులతో కలయిక ఆనందాన్ని నింపుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని అదనపు బాధ్యతలను కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. పిల్లల్లో ఒకరికి చదువుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగ జీవితం సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతుంది. వృత్తి రంగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. వ్యాపారాల్లో ముందుకు దూసుకుపోతారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. కొత్త ప్రయత్నాలు చాలావరకు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులు దూర ప్రాంతం నుంచి ఒక శుభవార్త వింటారు. కుటుంబానికి కొంత సమయం కేటాయించడం మంచిది.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

ఉద్యోగంలో పదోన్నతికి, జీతభత్యాల పెరుగుదలకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. బంధువులు, కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక ప్రయ త్నాలు కలిసి వస్తాయి. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు, పనులు, ప్రయత్నాలు చాలావరకు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ప్రయాణాలు, ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాలి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. తోబుట్టువులతో సఖ్యత పెరుగు తుంది. శుభకార్యాలకు సంబంధించి దగ్గరి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహి తులతో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తల్లితండ్రుల నుంచి సహాయం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు ఒక మెట్టు పైకి ఎక్కే అవకాశం ఉంది. వ్యాపారాల్లో మరింత ఉత్సా హంగా పని చేసి అంచనాలకు తగ్గట్టుగా లాభాలు అందుకుంటారు. షేర్లు, స్పెక్యులేషన్లకు సంబం ధించి కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపడతారు. బంధుమిత్రులతో ఉన్న కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. రాజకీయ వర్గాలతో పరిచయాలు పెరుగుతాయి. దూరపు బంధువుల్ని కలుసుకుంటారు. కుటుంబంలో శుభ కార్యాల ఆలోచన చేస్తారు. ఆదాయానికి లోటుండదు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహా యం చేసే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. కుటుంబ జీవితం చాలావరకు సాఫీగా సాగిపోతుంది. దూర ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపా రాల్లో కొత్త ప్రణాళికలను చేర్చడంలో అవరోధాలు ఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సాను కూలపడతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాల్లో కొన్ని శుభవార్తలు వింటారు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

ఉద్యోగంలో అదనపు బాధ్యతల వల్ల శ్రమ, ఒత్తిడి పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు నిలకడగా సాగుతాయి. భాగస్వాములతో మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు అనుకూలంగా ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పిల్లల విద్యా విషయాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఇంటికి బంధువుల రాకపోకలుంటాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

వృత్తి, ఉద్యోగాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. అవస రానికి ధనం చేతికి అందుతుంది. ఆదాయం వృద్ధి చెందుతుంది. విలువైన గృహోపకరణాలు కొను గోలు చేస్తారు. బంధువులతో ఒక శుభ కార్యంలో పాల్గొంటారు. విదేశాల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కొత్త ప్రయత్నాలు, నిర్ణయాలను ఆచరణలో పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కొందరు మిత్రుల విషయంలో ఆందోళనకరమైన విషయాలు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో పని భారం బాగా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా రాబడి పెరుగుతుంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెట్టడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. డాక్టర్లు, లాయర్లకు బాగా డిమాండ్ పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల్లో మోసపోవడం గానీ, నష్టపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు కొద్దిగా ఇబ్బంది కలిగిస్తాయి. ఆదాయం, ఆరోగ్యం బాగానే ఉంటాయి. ఖర్చులు పెరుగుతాయి.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. చిన్ననాటి మిత్రులతో బాగా ఎంజాయ్ చేస్తారు. రోజంతా హ్యాపీగా గడిచిపోతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. నిరుద్యోగులు శుభ వార్తలు వింటారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగ జీవితం ప్రశాంతంగా, సామరస్యంగా సాగిపోతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలను మరింత జాగ్రత్తగా నిర్వహించడం అవసరం. మితిమీరిన ఔదార్యం వల్ల దెబ్బతింటారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంది. ఆదాయాన్ని మించి ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లోనూ, ఆహార విహారాల్లోనూ జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

Follow Us
Redmi Book 14, Book 16 2027 ఫీచర్లు తెలుసా
Redmi Book 14, Book 16 2027 ఫీచర్లు తెలుసా
రాశిఫలాలు: ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
రాశిఫలాలు: ఈ రాశులకు చెందిన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
ఏపీ, తెలంగాణ ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. SIR గడువు పొడిగింపు..
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
‘డియర్ ఆస్ట్రోనాట్’ మంచి ప్రయోగం.. గొప్ప సినిమాగా నిలుస్తుంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. తెలుగులోనూ ఉంది
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
తెలంగాణ రైజింగ్‌లో భాగస్వాములు కావాలి.. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
ఫోన్‌కు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? .. ఈ తప్పు చేస్తే బ్యాంక్ ఖాళీ!
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
పాత బెడ్‌షీట్ పనికిరాదని పడేయకండి.. వీటిని ఇన్ని రకాలుగా వాడొచ్చా
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
తొలి 4 ఇన్నింగ్స్‌ల్లో 659 పరుగులు.. 100 ఏళ్ల రికార్డు బద్దలు
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!
ఒక్క సిక్స్ కొట్టకుండా 167 పరుగులు.. వన్డే హిస్టరీలో రికార్డ్..!