AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్టోబర్ 16 రాశిఫలాలు: ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్

Today Horoscope (October 16, 2026): శుక్రవారం కొన్ని రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో అనుకూల పరిస్థితులు కనిపించనున్నాయి. మరికొందరికి పనిభారం పెరిగినా తగిన గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, ఆదాయ వ్యయాల విషయంలో 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఏ రాశుల వారికి అదృష్టం కలిసిరానుంది? తెలుసుకోండి.

అక్టోబర్ 16 రాశిఫలాలు: ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో వీరికి గుడ్‌న్యూస్
Horoscope Today 16 Oct 2026
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 16, 2026 | 6:00 AM

Share

దిన ఫలాలు (అక్టోబర్ 16, 2026): మేష రాశి వారికి ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక విషయాలు బాగా సంతృప్తికరంగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. మిథున రాశి వారికి ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలు ప్రవేశ పెట్టి లాభాలు ఆర్జిస్తారు. ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు బాగా సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని తగ్గిం చుకుంటారు. స్వల్ప అనారోగ్యాలుంటే ఉండవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రులకు సహాయం చేస్తారు.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

ఉద్యోగంలో భద్రత, స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందినవారు ముఖం చాటేసే అవకాశం ఉంది. కొత్త ప్రయత్నాలు, కార్యక్రమాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు.

ఇవి కూడా చదవండి

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. వృత్తి జీవితంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాలు లాభదాయకంగా సాగుతాయి. ముఖ్య మైన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు, అవివాహితులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. ఉద్యోగులకు కూడా కొత్త ఆఫర్లు అందుతాయి. దూర ప్రాంతం నుంచి అనుకోకుండా ఒక శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితంలో ఆశించిన సుఖ సంతోషాలు నెలకొంటాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా, సంతృప్తికరంగా సాగిపోతాయి కానీ, అధికారులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. వ్యాపారాలు నిలకడగా పురోగమిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేసుకుంటారు. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో మధ్య మధ్య చికాకులు, ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కొన్ని ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

ఉద్యోగంలో కొత్త కార్య క్రమాలు, బాధ్యతలు చేపడతారు. అధికారులతో సామరస్యం పెరుగుతుంది వృత్తి, వ్యాపారాల్లో రాబడి కొద్దిగా పెరుగుతుంది. ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ఖర్చుల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత, కుటుంబ సమస్యల్ని జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

అధికారులకు, సహోద్యోగులకు ఎంతగానో ఉపయోగపడతారు. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అవుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలపడతాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటాయి. మధ్యవర్తుల కారణంగా ఆస్తి వివాదం పరిష్కారమవు తుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో ఒక శుభకార్యంలో పాల్గొంటారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. కొందరు బంధు మిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. తల్లి తండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలు సఫలం అయ్యే సూచనలున్నాయి.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు, లక్ష్యాలు పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగ స్థానంలో కేతు గ్రహం సంచారం కారణంగా మధ్య మధ్య బరువు బాధ్యతలు పెరగడం, విశ్రాంతి లేకపోవడం వంటివి జరు గుతాయి. అధికారులు ఎక్కువగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. సొంత పనులు పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు బాగా లాభిస్తాయి.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలకు సమయం బాగా అను కూలంగా ఉంది. ఆదాయం పెరిగే సూచనలున్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగు లకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలు అమలు చేసి లాభాలు గడిస్తారు. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు, సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధార పడడం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగు తుంది. వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ప్రయాణాలు కూడా బాగా లాభిస్తాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు కనిపిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉండవచ్చు. ఖర్చుల్ని అదుపు చేస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంది. ఎవరినీ అతిగా నమ్మకపోవడం మంచిది. కుటుంబ వ్యవహారాల్లో అశ్రద్ధ పనికి రాదు. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలకు విలువనివ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

ఉద్యోగంలో ఆదరాభిమానాలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపా రాల్లో లాభాలు గడిస్తారు. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలిక్కి వస్తుంది. ఇల్లు గానీ, స్థలంగానీ కొనే విషయం ఆలోచిస్తారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక సేవల మీద ఖర్చు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలి స్తాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి.

Follow Us