జూలై 16 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ఆర్థిక లాభాలు.. మీ రాశి ఉందా?
Horoscope Today (July 16, 2026): గురువారం 12 రాశుల వారికి గ్రహాల సంచారం అనుకూల, ప్రతికూల ఫలితాలను అందించనుంది. కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు, ఉద్యోగ-వ్యాపారాల్లో పురోగతి కనిపించగా, మరికొన్ని రాశుల వారు ఖర్చులు, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. మేషం నుంచి మీనం వరకు మీ రాశి ఫలితం ఎలా ఉందో తెలుసుకోండి.

దిన ఫలాలు (జూలై 16, 2026): మేష రాశి వారికి ఈ రోజు ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఊహించని విధంగా మంచి ధన యోగం పడుతుంది. వృషభ రాశి వారికి వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు మరింతగా అనుకూలంగా సాగిపోతాయి. మిథున రాశి వారికి ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి గురువారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..?
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఊహించని విధంగా మంచి ధన యోగం పడుతుంది. కీలక విషయాల్లో తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. సమాజంలో ప్రముఖుల నుంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి. అనుకున్న పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగి పోతాయి. అధికారుల నుంచి ఆదరణ లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోతారు. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది.
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరుగుతుంది. ఆర్థిక విషయాలు మరింతగా అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాల పెరుగుదల వంటి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ జీవితం సానుకూలంగా సాగిపోతుంది. కుటుంబ వ్యవహారాల్లో బంధు వుల్ని తలదూర్చనివ్వవద్దు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి.
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
కొందరు రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో ఆశించిన సమాచారం అందుతుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో పెట్టుబడులకు తగ్గ లాభాలు అందుతాయి. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతాయి.
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం పెరిగి, ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింతగా అనుకూలంగా ఉంటుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో సొంత ఆలోచనల మీద ఆధారపడడం ఉత్తమం. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
అదనపు ఆదాయం కొద్దిగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక సమ స్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. కొద్దిపాటి ఆటంకాలు, ఇబ్బందులున్నా ఆస్తిపాస్తులకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ధనపరంగా ఇతరులకు వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో సమస్యలు తగ్గి రాబడి పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారుల నమ్మ కాన్ని చూరగొంటారు. ప్రేమ వ్యవహారాల్లో అసంతృప్తి తలెత్తుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
వృత్తి, ఉద్యోగాలు, ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగంలో స్థిరపడే అవకాశంఉంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు, సూచ నలు కలిసి వస్తాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆదాయపరంగా అదృష్టం కలిసి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి ఏమాత్రం లోటుం డదు. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది.
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారాల్లో దూసుకుపోతారు. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు ఊపందుకుంటాయి. కుటుంబ సభ్యు లతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఊహించని కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. కొత్త ఆలోచనలకు, కొత్త ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి. ఆశించిన పెళ్లి సంబంధం ఖాయమవుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)
సర్వత్రా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపడతాయి. అనుకోకుండా కొత్త బాధ్యతలను చేపట్టడం జరుగుతుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగు తుంది. ఉద్యోగ ప్రయత్నాలు చాలావరకు సఫలం అవుతాయి. ప్రయాణాలు ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం మీద శ్రద్ద పెట్టడం మంచిది. ఉండాలి. ప్రేమ వ్యవహారాలు సాదా సీదాగా సాగిపోతాయి.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారు బాగా బిజీ అవుతారు. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. మిత్రుల వల్ల డబ్బు నష్టపోవడం లేదా మోసపోవడం జరుగుతుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. సొంత విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ప్రేమ వ్యవహారాలు సాఫీగా, హ్యాపీగా సాగుతాయి.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)
పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఆశించిన శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టు దలగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రోత్సాహకాలు అందుకుంటారు. ఇష్టమైన బంధు మిత్రు లతో ఎంజాయ్ చేస్తారు. వ్యాపార లావాదేవీలు లాభాల బాటలో సాగుతాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో ఆశించిన పురోగతి ఉంటుంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ప్రేమ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. బంధువుల్లో పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ధన యోగం పడుతుంది. ఆర్థిక బలం పెరుగు తుంది. జీవిత భాగస్వామికి మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ప్రతిష్ఠాత్మక కంపెనీల నుంచి మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి పెరుగుతుంది. వృత్తి, ఉద్యో గాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా సాగుతుంది. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది.
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమైన ఆస్తి, ఆర్థిక వ్యవహారాలను చక్కబెడ తారు. వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో బరువు బాద్యతలు పెరిగే సూచనలున్నాయి. అధికారులు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులుంటాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
Also Read: 12 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు జాక్‌పాట్ ఖాయం..!



