బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..! వారికి విశేష ఫలితాలు

ఇతర రాశుల్లో బుధ, రవులు కలవడం ఒక ఎత్తు కాగా, బుధ క్షేత్రాలు, రవి క్షేత్రాల్లో ఈ రెండు గ్రహాలు కలవడం మరో ఎత్తు. ఈ మేషం, మిథునం, సింహం, కన్యా రాశుల్లో బుధాదిత్య చేసుకోవడం వల్ల రెట్టింపు శుభ ఫలితాలు ఉండడంతో పాటు విపరీత రాజయోగాలు కూడా కలుగుతాయి. ఈ నెల 24 నుంచి బుధుడికి ఉచ్ఛ క్షేత్రమైన కన్యా రాశిలో రవి, బుధులు కలవడం వల్ల కొన్ని రాశుల వారు విశేష ఫలితాలను పొందబోతున్నారు.

బుధాదిత్య యోగం.. ఆ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..! వారికి విశేష ఫలితాలు
Budhaditya Yoga
Follow us

| Edited By: Janardhan Veluru

Updated on: Sep 20, 2024 | 7:29 PM

ఇతర రాశుల్లో బుధ, రవులు కలవడం ఒక ఎత్తు కాగా, బుధ క్షేత్రాలు, రవి క్షేత్రాల్లో ఈ రెండు గ్రహాలు కలవడం మరో ఎత్తు. ఈ మేషం, మిథునం, సింహం, కన్యా రాశుల్లో బుధాదిత్య చేసుకోవడం వల్ల రెట్టింపు శుభ ఫలితాలు ఉండడంతో పాటు విపరీత రాజయోగాలు కూడా కలుగుతాయి. ఈ నెల 24 నుంచి బుధుడికి ఉచ్ఛ క్షేత్రమైన కన్యా రాశిలో రవి, బుధులు కలవడం వల్ల కొన్ని రాశుల వారు విశేష ఫలితాలను పొందబోతున్నారు. వృషభం, మిథునం, సింహం, కన్య, వృశ్చికం, ధనూ రాశుల వారు అనేక విధాలుగా లక్ష్మీ కటాక్షం పొందడం జరుగుతుంది. ఈ యోగం అక్టోబర్ 10 వరకూ కొనసాగుతుంది.

  1. వృషభం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడడం అత్యంత శ్రేష్ఠమైన యోగం. దీనివల్ల జీవితంలో విజయ పరంపర ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులే కాక, నిరుద్యోగులు కూడా పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణించి అందలాలు ఎక్కడం జరుగుతుంది. ఎటువంటి ఆదాయ ప్రయత్నం తలపెట్టినా విజయ వంతం అవుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది.
  2. మిథునం: ఈ రాశికి చతుర్థ కేంద్రంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల మనశ్శాంతికి, సుఖ సంతో షాలకు లోటుండదు. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. మనసులోని ఆశలు, ఆశ యాలు చాలావరకు నెరవేరుతాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సునాయాసంగా నెరవేరు తాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అత్యధికంగా లాభాలు గడిస్తాయి.
  3. సింహం: ఈ రాశికి ధన స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఆదాయం ఇబ్బడిముబ్బ డిగా పెరుగుతుంది. ప్రతి ఆదాయ ప్రయత్నమూ కలిసి వస్తుంది. మాటకు, చేతకు విలువ ఉంటుంది. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు బాగా రాణిస్తాయి. స్థిరత్వం లభిస్తుంది. వృత్తి, వ్యాపా రాలు నష్టాల నుంచి పూర్తిగా బయటపడి లాభాల బాటపడతాయి. కుటుంబ జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోతుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. రావలసిన డబ్బు తేలికగా చేతికి అందుతుంది.
  4. కన్య: ఈ రాశిలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల సామాజికంగా ఉన్నత స్థాయికి చేరే అవ కాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు వేతనాలు కూడా అంచనాలకు మించి పెరిగే అవ కాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా వృద్ధి చెందుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ప్రముఖులలో ఒకరుగా మంచి గుర్తింపు పొందుతారు.
  5. వృశ్చికం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. మంచి లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి, వేతనాల పెరుగుదలకు అవ కాశం ఉంది. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు వృద్ది చెందుతాయి.
  6. ధనుస్సు: ఈ రాశికి దశమ స్థానంలో బుధ, రవులు కలవడం వల్ల బుధాదిత్య యోగంతో పాటు, విపరీత రాజయోగం కూడా కలిగింది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది. కార్యకలాపాలు, లావాదేవీలు విస్తరిస్తాయి. ఉన్నత స్థాయి వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుకుంటారు. ఆదాయం బాగా పెరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది.