AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YSRCP: రెండో విడత సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న మంత్రులు.. ఎప్పటి వరకూ కొనసాగుతుందంటే..

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో అలాగే అనంతపురం జిల్లా తాడిపల్లి నియోజకవర్గంలో సాగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు.

YSRCP: రెండో విడత సామాజిక సాధికార యాత్రలో పాల్గొన్న మంత్రులు.. ఎప్పటి వరకూ కొనసాగుతుందంటే..
Ysrcp Social Empowerment Bus Yatra
Srikar T
|

Updated on: Nov 27, 2023 | 10:17 AM

Share

వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో అలాగే అనంతపురం జిల్లా తాడిపల్లి నియోజకవర్గంలో సాగనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండతో సాధికారత సాధించిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు కాకినాడ జిల్లా తునిలో విజయయాత్ర చేశారు. నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించాయి. యాత్రకు దారిపొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తుని ఎమ్మెల్యే, మంత్రి దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో రాజా కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభకు వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు.

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తున్న మేలు, సాధికారతకు చేస్తున్న కృషిని నేతలు వివరించారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు, మేరుగు నాగార్జున, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో పేదల స్థితిగతులు మార్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌ అన్నారు మంత్రి మేరుగు నాగార్జున. అనకాపల్లి జిల్లా పెందుర్తిలో ఎమ్మెల్యే అదీప్ రాజు అధ్వర్యంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగింది. ముందుగా.. జీవీఎంసీ కళ్యాణ మండపంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించిన మంత్రులు, ప్రజాప్రతినిధులు.. అనంతరం.. వేపగుంట నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు భారీ ర్యాలీ చేశారు.

యాత్రలో భాగంగా సబ్బవరం జంక్షన్‌లో నిర్వహించిన బహిరంగ సభకు మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్నాథ్, శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాంతోపాటు పలువురు ఎంపీలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఇక.. గవర్నమెంట్‌ స్కూల్స్‌లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు సీఎం జగన్‌ విద్యా భరోసా కల్పించారన్నారు ఏపీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు. రెండోవిడత సాధికార బస్సుయాత్ర ఈనెల 30వరకు కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
రోటీ, చపాతీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.. ఆలూ బెండీ ఇలా చేయండి
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
ఆఫర్‌ అంటే ఇది కదా..! మహీంద్రా కారుపై రూ.4.45 లక్షల డిస్కౌంట్‌!
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
మార్నింగ్ వాక్‌కు వెళ్తున్నారా.. ఈ తప్పులు చేస్తే లాభం కంటే..
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
చెన్నైను దగ్గరుండి ఓడించిన ధోని.. మిస్టర్ కూల్ మాస్టర్ ప్లాన్ ఇదే
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
జియోలో అతి చౌకైన ప్లాన్‌తో 11 నెలల వ్యాలిడిటీ.. బెనిఫిట్స్‌ ఇవే!
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
చలికాలంలో జుట్టు సమస్యలా..? ఐతే ఈ జ్యూస్ రోజూ గ్లాసుడు తాగండి..
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
కాలేయం దెబ్బతిన్నప్పుడు ఏమి జరుగుతుంది?
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
మెగా విక్టరీ మాస్ సాంగ్ అప్డేట్ వచ్చేసింది
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
రోటీ, నాన్‌కు బైబై.. పెనంపైనే అదిరిపోయే పంజాబీ కుల్చా రెడీ
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే
పన్ను స్లాబ్‌ల నుండి ఐటీఆర్ వరకు..2025లో జరిగిన కీలక మార్పులు ఇవే