తెలంగాణ ఎన్నికలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణ ఎన్నికలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్రస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు. టీఎస్‌ పాలిటిక్స్‌కు, ఏపీ రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగినా ఏపీపై ప్రభావం ఉండదన్నారు. అటు.. ఏపీ-తెలంగాణలో టీడీపీ-జనసేన పొత్తుల వ్యవహారంపై మరోసారి వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

తెలంగాణ ఎన్నికలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
Ambati Rambabu
Follow us
Ram Naramaneni

|

Updated on: Nov 26, 2023 | 9:17 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పీక్‌ స్టేజ్‌కు చేరింది. సరిగ్గా మరో ఐదు రోజుల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. ఇలాంటి సమయంలో.. తెలంగాణ ఎన్నికలపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఏం జరిగినా.. ఏపీలో ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. తెలుగు రాష్ట్రాలుగా సత్సంబంధాలు కొనసాగుతాయని చెప్పారు అంబటి రాంబాబు. ఇక.. ఏపీ, తెలంగాణలో పొత్తుల వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై నిప్పులు చెరిగారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీలో పొత్తులు పెట్టుకున్న టీడీపీ-జనసేన, తెలంగాణలో ఎందుకు కలిసి పనిచేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ.. కాంగ్రెస్‌కు మద్దతు తెలిపిందనేది బహిరంగ రహస్యం అని ఆరోపించారు అంబటి.

మొత్తంగా.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ- జనసేన విచిత్ర పొత్తులను గుర్తు చేస్తూ.. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు. అదే సమయంలో.. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలపైనా చేసిన కామెంట్స్‌ కూడా ఆసక్తికరంగా మారుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..