AP News: వైసీపీ @ ఆపరేషన్ ఆకర్ష్.. ప్రత్యర్ధి పార్టీల అసంతృప్తి నేతలే టార్గెట్..!

ఏపీలో అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలకు వైసీపీ కండువా కప్పేస్తుంది. మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాయినింగ్స్ అయితే.. ఇప్పుడు బస్ యాత్రలో స్థానికంగా బలంగా ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది అధికార పార్టీ.

AP News: వైసీపీ @ ఆపరేషన్ ఆకర్ష్.. ప్రత్యర్ధి పార్టీల అసంతృప్తి నేతలే టార్గెట్..!
YSR Congress Party
Follow us
S Haseena

| Edited By: Ravi Kiran

Updated on: Apr 03, 2024 | 12:45 PM

ఏపీలో అధికార వైసీపీ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలకు వైసీపీ కండువా కప్పేస్తుంది. మొన్నటి వరకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జాయినింగ్స్ అయితే.. ఇప్పుడు బస్ యాత్రలో స్థానికంగా బలంగా ఉన్న నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తోంది అధికార పార్టీ. ఇలా ఇడుపులపాయ టూ ఇచ్చాపురం వరకు సాగే బస్ యాత్రలో బీజేపీ, టీడీపీ, జనసేన అసంతృప్తి నేతలకు వైసీపీ కండువా కప్పేలా ప్లాన్ చేసుకుంది అధికార పార్టీ.

వచ్చే ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఒకటిగా కూటమి కట్టాయి. ఈ మూడు పార్టీలలో ఆశావాహులు ఉన్నారు. ఉన్నవి 175 అసెంబ్లీ, పాతిక ఎంపీ సీట్లు మాత్రమే. పైగా ఈ మూడు పార్టీల బలం ఎక్కువగా కోస్తా జిల్లాలోనే ఉంది. దాంతో పాటు మూడు పార్టీల పొలిటికల్ ఫిలాసఫీ కూడా ఒక్కటే. అభిమానించే వర్గాలు కూడా దాదాపుగా ఒక్కటే. దాంతోనే సీట్ల దగ్గర పేచీ వస్తోంది. టికెట్ దక్కనివారు అలుగుతున్నారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిపోతామని చెబుతున్నారు. రెబల్స్ ఇలా కూటమి గుండెలలో బెల్స్‌ను మోగిస్తుంటే.. వైసీపీ జాగ్రత్తగా ఈ పరిణామాలను గమనిస్తోంది. వచ్చినవారిని వచ్చినట్లే చేర్చుకోవడానికి గేట్లు తెరుస్తోంది. అదే సమయంలో రానివారికి.. రెబల్స్‌గా ఉందామనుకునేవారికి తెర వెనక మద్దతు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది వైసీపీ.

టీడీపీలో నాలుగు దశాబ్దాలుగా ఉన్న నాయకులు అయితే అసంతృప్తి ఎంత ఉన్నా అణచుకుంటున్నారు తప్ప బయటపడడం లేదు. ఇటీవల జనసేన పార్టీకి చెందిన కీలక నేత, ముమ్మిడివరం టికెట్ ఆశించిన పితాని బాలకృష్ణకు టికెట్ రాకపోవడంతో ఆయన మార్చి 30న వైసీపీలో చేరారు. అదే విధంగా విశాఖలో కీలక జనసేన నేతల విషయంలోనూ వైసీపీ వల విసురుతోందని అంటున్నారు. అలాగే విజయవాడలో కొంతమంది నిరాశతో ఉన్నారు. వారి విషయంలో కూడా ప్లాన్-బీని అమలు చేస్తోంది. ఎక్కువగా ఉత్తరాంధ్రా, గోదావరి జిల్లా జనసేన నేతలు.. అలాగే టీడీపీ నేతల మీద వైసీపీ గురి పెట్టింది. పోలింగ్‌కు నలభై రోజులకు పైగా సమయం ఉంది. దాంతో కూటమి పెద్దలు అసంతృప్తులను కంట్రోల్ చేసే పనిలో పడ్డారు. అయితే వైసీపీ కూడా వారి మీద ఆకర్షణ మంత్రాన్ని ప్రయోగిస్తోంది. ఇందులో బిగ్ షాట్స్ నుంచి కీలక నేతలు, ద్వితీయ శ్రేణి నాయకుల దాకా ఉన్నారని టాక్. మరి వైసీపీ ప్లాన్-ఏ మేరకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.