MP Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌరవం.. మళ్లీ రాజ్యసభ వైస్ ఛైర్మన్ ప్యానెల్‌లో చోటు..
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో చోటుదక్కింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని రాజ్యసభ వైస్ చైర్మన్ ప్యానల్ లో చోటుదక్కింది. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్.. సోమవారం రాజ్యసభ ప్యానల్ జాబితాలో చేర్చుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎంపీ విజయసాయి రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా నరేంద్రమోదీ, ప్రల్హాద్ జోషికి ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 19, 2022న తనను వైస్-ఛైర్మెన్ ప్యానెల్‌కి తిరిగి నామినేట్ చేసినందుకు ధన్యావాదాలు తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతృప్తి చెందేలా సభ సజావుగా జరిగేలా చూసేందుకు ప్రయత్నిస్తానంటూ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
ఎంపీ విజయసాయి రెడ్డితోపాటు పీటీ ఉష కూడా రాజ్యసభ ప్యానెల్ వైస్ చైర్మన్‌గా నియామకమయ్యారు. ఈ మేరకు రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్కడ్ ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ ఎంపీలు విజయసాయి రెడ్డి, పీటీ ఉషను అభినందించారు.




రాజ్యసభ ప్యానెల్ చైర్మన్లలో మొత్తం తొమ్మిది మంది నియమితులయ్యారు. వారిలో భుబనేశ్వర్ కలిత, ఎన్ హనుమంతయ్య, తిరుచి శివ, సుఖేందు శేఖర్ రాయ్, సస్మిత్ పాత్ర, సరోజ్ పాండే, సురేంద్ర సింగ్ నగర్, విజయసాయి రెడ్డి, పీటీ ఉష ఉన్నారు.
విజయసాయి రెడ్డి ట్వీట్..
I express gratitude to Chairman, Rajya Sabha, Shri @jdhankhar1 ji, Shri @narendramodi ji and Shri @JoshiPralhad for re-nominating me to the Panel of Vice-Chairmen w.e.f. 19 Dec 2022. I shall try to ensure that the Rajya Sabha functions smoothly to the satisfaction of the members. pic.twitter.com/KXr7hOPOS9
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 20, 2022
ఇదిలాఉంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిని రాజ్యసభ ప్యానల్ వైస్ చైర్మన్ జాబితాలో మొదట చేర్చిన రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ అనూహ్యంగా తొలగించారు. రాజ్యసభ కార్యాలయం నుంచి విజయసాయిరెడ్డికి సమాచారం కూడా వచ్చింది. ఈ క్రమంలో రాజ్యసభ వెబ్‌సైట్‌లో ప్యానల్ వైస్ చైర్మన్ల జాబితాను పెట్టినప్పుడు ఎనిమిదో పేరుగా విజయసాయిరెడ్డిని ప్రస్తావించారు.
అయితే, రాజ్యసభలో అధికారిక ప్రకటన చేస్తున్న సమయంలో రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ మాత్రం ప్యానల్ వైఎస్ చైర్మన్ జాబితాను పునర్‌వ్యవస్థీకరించామని చెప్పి ఏడు పేర్లే ప్రకటించారు. ఎనిమిదో పేరుగా ఉన్న విజయసాయిరెడ్డి పేరును మాత్రం ప్రస్తావించలేదు. దీంతో ఆయన పేరు తొలగించినట్లు తెలిసింది.
అయితే.. మొదట ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు చెబుతూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేసి.. ఆ తర్వాత తన పేరు ప్రకటించకపోవడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. అయితే చివరి క్షణంలో విజయసాయిరెడ్డి పేరును రాజ్యసభ చైర్మన్ ఎందుకు తొలగించారన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే ఉన్న సమయంలో మళ్లీ ఆయనను నియమించడం చర్చనీయాంశంగా మారింది. విజయసాయిరెడ్డి తీరుపై పలువురు ఫిర్యాదు చేయడంతోనే.. మొదట ఆయన పేరును తొలగించినట్లు తెలుస్తోంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం..




