బాపట్ల జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారు. పొట్టిసుబ్బయ్యపాలెం దగ్గర్లోని ఆయన సొంత రొయ్యల ఫ్యాక్టరీలో సోమవారం వాకింగ్ చేస్తున్నారు. దీంతో అక్కడున్న పాము ఆమంచిని కరిచింది. ఇది గమనించిన ఆయన అనుచరులు హుటాహుటీనా స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తీసుకెళ్లారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఇదిలా ఉండగా ఆమంచి చీరాల నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఈ తర్వాత వైసీపీ పార్టీలో చేరిపోయారు. ప్రస్తుతం ఆయన పర్చూరు వైసీపీ ఇంఛార్జిగా కొనసాగుతున్నారు. అలాగే ఇటీవలే ఆయన సొదరుడు ఆమంచి స్వాములు జనసేన పార్టలో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఆమంచి కృష్ణమోహన్ పాముకాటుకు గురయ్యారన్న విషయం తెలియడంతో వైసీపీ శ్రేణులు ఆందోళ చెందారు. ఆయన్ను పరామర్శించేందుకు నేతలు ఆస్పత్రికి క్యూ కడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి.