AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు.. ఉదయం శవమై కనిపించాడు.. అసలేం జరిగింది

ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. గుంటూరు(Guntur) జిల్లా రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి..

ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లాడు.. ఉదయం శవమై కనిపించాడు.. అసలేం జరిగింది
Wife Murder
Ganesh Mudavath
|

Updated on: Feb 24, 2022 | 6:22 AM

Share

ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన యువకుడు దారుణ హత్య(Murder)కు గురయ్యాడు. గుంటూరు(Guntur) జిల్లా రాజుపాలెం మండలంలోని పెదనెమలిపురి గ్రామానికి చెందిన నరసింహారావు, నాగమణి దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో నవీన్‌ పెద్దవాడు. రోజూ గొర్రెలను మేపేందుకు ఊరి బయటకు వెళ్తాడు. మంగళవారం రాత్రి నవీన్ కు ఫోన్‌ రావడంతో.. బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో రహదారి పక్కన పొలానికి వెళ్లే దారిలో గుర్తు తెలియని వ్యక్తులు నవీన్ ను బండరాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశారు. ఉదయాన్నే పొలాలకు వెళ్తున్న రైతులు మృతదేహాన్ని(Dead body) చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. డాగ్‌స్వ్కాడ్‌, క్లూస్‌టీంలతో ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.

హత్య కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు.. నవీన్‌తో రెండ్రోజులుగా తిరిగిన యువకులను అదుపులోకి తీసుకున్నారు. నవీన్ తో పాటు అతని కుటుంబ సభ్యులకూ ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడంతో హత్యకు కారణాలేమై ఉంటాయనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. చేతికి అందివచ్చిన కుమారుడు హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

Also Read

Gold Silver Price: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన పసిడి ధరలు.. పూర్తివివరాలివే..

Virat Kohli: విరాట్ కోహ్లీ మెంటల్ హెల్త్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ ఆందోళన.. ఎందుకంటే?

Vodafone: ఎయిర్‌టెల్‌‌కు తన వాటాను విక్రయించనున్న వోడాఫోన్.. డీల్ విలువ ఎంతంటే..