AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ..

గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు.

Watch Video: ఏపీలో తెరపైకి మరో రగడ.. ఆ అంశంపై కోర్టుకు వెళ్తామంటున్న వైసీపీ..
Yv Subba Reddy
Srikar T
|

Updated on: May 29, 2024 | 4:17 PM

Share

గెజిటెడ్‌ అధికారి సీల్‌, హోదా వివరాలు లేకపోయినా.. బ్యాలెట్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఈనెల 25న ఆదేశాలు జారీ చేసింది. సీఈవో జారీ చేసిన ఆదేశాలు గతంలో ఇచ్చిన నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. తాజా ఆదేశాలతో ఎన్నికల నిర్వహణ సమగ్రత దెబ్బతింటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ సడలింపుల విషయంలో ఈసీ పునరాలోచించకపోతే.. కోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ ముఖ్య నేతలు. ఈ అంశంపై వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఏ రాష్ట్రంలో లేని సడలింపులు ఇక్కడే ఎందుకని ప్రశ్నించారు. టీడీపీకి ఎలాగూ గెలిచే ఆలోచన లేదన్నారు.

ఏవైనా నియోజకవర్గాల్లో పోటాపోటీ ఉన్నప్పుడు ఈ పోస్టల్ బ్యాలెట్లను అడ్డుపెట్టుకుని మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్‎ను అడ్డుపెట్టుకుని ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై తమ పార్టీ ముఖ్యనేతలు కేంద్ర ఎన్నికల అధికారి రాజీవ్ శర్మను కలిసి వివరిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఏవిధంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కొనసాగిస్తారో అదే మాదిరిగానే ఏపీలో పోస్టల్ ఓట్లు లెక్కించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ మీనా సాయంత్రం 4 గంటల లోగా స్పందించకపోతే హైకోర్టుకు వెళ్తామంటున్నారు వైసీపీ నేతలు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..