
ముందు ఆయన ఒక చెప్పు చూపించాడు.. ఈయన రెండు చెప్పులు చూపించాడు.. ఇదంతా ఒకటైతే తాజాగా ఇంకో చెప్పు వ్యవహారం తెరమీదకు వచ్చింది… ఇలాఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ‘చెప్పుల’ వార్ నడుస్తోంది. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే పేర్నినానిల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండ్రోజుల క్రితం పవన్ కల్యాణ్‌ను విమర్శిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని రెండు చెప్పులు చూపించిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన పవన్ ‘ నా రెండు చెప్పులు దొంగలించారు’ అంటూ మాజీ మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు పేర్ని నాని. గత రాత్రి పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా మరోసారి చెప్పుల డైలాగులు వదిలారు వైసీపీ ఎమ్మెల్యే. ‘చెప్పులు పోతే 3 రోజుల తర్వాత కంగారు పడుతున్నారు. గత సంవత్సరం అక్టోబర్ 18 న రాత్రి నేను లింగమనేనిచెందిన వెంకటేశ్వర స్వామి గుడి కి వెళ్లగా ఒక చెప్పు పోయింది. ఒక చెప్పు పోయి 9 నెలలు అవగా ఎవరిని అనుమనిస్తాం ఎదురుగా ఉన్న పవన్ కల్యాణ్ ఆఫీస్ ఉంటే ఆయనను అనుమనిస్తామా? పోయిన చెప్పులను ఎవరో ఒకరు తిరిగి కొనిస్తారు? లేకపోతే ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తాడు. నీ పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది. ముందు అది చూసుకో’ అంటూ కౌంటరిచ్చారు నాని.
ఇక మంత్రి దాడిశెట్టి రాజా కూడా పవన్‌కు కౌంటర్ ఇచ్చారు.పేర్ని నాని ఇంట్లో ఎవరో చెప్పులు దోచేశారని. అ వ్యక్తి కాకినాడ జిల్లాలో తిరుగుతున్నాడంటూ సెటైర్లు వేశారు. అలాగే పవన్‌ను సైకియాట్రిస్టుకు చూపించాలన్నారు. ఇక పవన్‌పై పేర్నినాని వ్యాఖ్యలకు నిరసనగా తిరుపతిలో జనసేన కార్యకర్తలు ఏకంగా పేర్నినాని చిత్రపటానికి చెప్పుల దండవేశారు. వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మొత్తానికి ఏపీలో వైసీపీ, జనసేన పార్టీల మధ్య చెప్పుల యుద్దాలు హాట్ టాపిక్ గా మారాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..