ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పదో తరగతి ఫలితాలపై రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) స్పందించారు. ఫలితాలను ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకోవాలని చూడటం దారుణమని మండిపడ్డారు. అభం శుభం తెలియని పిల్లలకు ఏవేవో చెప్పి ఆత్మహత్యలు చేసుకునేలా నారా లోకేశ్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి పనులు చేయవద్దని చెప్పేందుకు లోకేశ్ నిర్వహించిన జూమ్ మీటింగ్ లో పాల్గొన్నానని చెప్పారు. కానీ లోకేశ్ మాత్రం తాము చెప్పింది వినకుండా మీటింగ్ కట్ చేశారని చెప్పారు. లోకేశ్(Lokesh) తో బహిరంగ చర్చకూ తాను సిద్ధమేనని కొడాలి నాని స్పష్టంచేశారు. విద్యార్థులను నెలరోజులు చదివించి వారి సామర్థ్యాలు పెంచేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని కొడాలి నాని సూచించారు. ఫెయిలైన విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాస్తే తప్పకుండా పాస్ అవుతారని స్పష్టం చేశారు.
కరోనా వల్ల రెండేళ్లుగా 8, 9 తరగతులు సరిగా జరగలేదు. దీంతో పాస్ పర్సంటేజ్ తగ్గిపోయింది. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరగలేదు. దీంతో ఉత్తీర్ణతశాతం పడిపోయింది. కానీ దీనిని కూడా ప్రతిపక్షాలు రాజకీయంగా వాడుకుంటున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాస్తే డైరెక్ట్‌గా పాసైనట్లు సర్టిఫికెట్ ఇస్తాం. వారిని ఇప్పుడు పాస్ చేసినా.. ఇంటర్‌లో మళ్లీ తప్పుతారు. పిల్లలకు పది గ్రేస్ మార్కులు వేయాలని పవన్ డిమాండ్ చేస్తున్నారు. గ్రేస్ మార్కులు ఎందుకు? గ్రేస్ మార్కులు వేస్తే వారు కూడా లోకేశ్, పవన్ కల్యాణ్‌లా తయారవుతారు.
– కొడాలి నాని, ఏపీ మాజీ మంత్రి
కరోనాతో సరిగ్గా తరగతులు జరగనందున పిల్లల్లో విషయాన్ని గ్రహించే సామర్ధ్యం తగ్గిపోయిందన్నారు. దీంతో రెండు లక్షల మంది ఫెయిల్ అయ్యారని చెప్పారు. వారి సామర్థ్యాలు పెంచేందుకు సీఎం జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని కొడాలి నాని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి