AP News: తిరుపతిలో నడి రోడ్డుపై బైఠాయించిన ఇద్దరు మహిళలు.. ఇంతకీ విషయం ఏమంటే..?

| Edited By: Srikar T

Feb 13, 2024 | 9:19 AM

తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్‎లో గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు తిరుచానూరు నుంచి వచ్చే వాహనాలు మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు. ఇక మధ్యలో బైకులు, కార్లు, ఆటోలు ఎక్కడి నిలిచిపోవడంతో గంటకు పైగా ట్రాఫిక్ స్థంభించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లక్ష్మీపురం సర్కిల్ వద్దకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులకు అసలు విషయం తెలిసింది.

AP News: తిరుపతిలో నడి రోడ్డుపై బైఠాయించిన ఇద్దరు మహిళలు.. ఇంతకీ విషయం ఏమంటే..?
Tirupati Women Protest
Follow us on

తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్‎లో గంటకు పైగా ట్రాఫిక్ స్తంభించింది. ఒకవైపు తిరుచానూరు నుంచి వచ్చే వాహనాలు మరోవైపు ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులు. ఇక మధ్యలో బైకులు, కార్లు, ఆటోలు ఎక్కడి నిలిచిపోవడంతో గంటకు పైగా ట్రాఫిక్ స్థంభించింది. అసలు ఏం జరిగిందో తెలుసుకునేందుకు లక్ష్మీపురం సర్కిల్ వద్దకు చేరుకున్న ట్రాఫిక్ పోలీసులకు అసలు విషయం తెలిసింది. లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్న వ్యక్తి.. డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పడంతో వచ్చిన ఇద్దరు మహిళలపై దాడి జరిగిందని అర్థమైంది. తిరుపతికి చెందిన రాధా, రూపనే ఇద్దరు మహిళలు సాయి అనే వ్యక్తికి లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చారు. స్విమ్స్ ఆసుపత్రిలో సెక్యూరిటీగా పనిచేస్తున్న సాయి ఇంటి వద్ద ఉన్న ఈ ఇద్దరు మహిళలు అప్పుగా ఇచ్చిన డబ్బును వసూలు చేసుకునే ప్రయత్నంలో చావు దెబ్బలు తిన్నారు. గత కొన్ని రోజులుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని సాయిపై ఒత్తిడి చేసిన రాధా, రూప ఈ రోజు ఫోన్ చేసి గట్టిగా అడిగారు. ఈ నెలలో రూ. 50 వేలు, వచ్చే నెల లో రూ. 50 వేలు తిరిగి చెల్లిస్తానన్నాడు.

ఈ మేరకు రాత్రి 8 గంటల సమయంలో లక్ష్మీపురం సర్కిల్ వద్ద ఉన్న అన్నపూర్ణేశ్వరి టెంపుల్ వద్దకు రమ్మని చెప్పాడు. దీంతో సాయి వద్ద నుంచి డబ్బు తిరిగి వస్తుందని భావించిన రాధా, రూపలకు చేదు అనుభవం ఎదురయింది. సాయి కుటుంబ సభ్యులతో కలిసి ఇద్దరు మహిళలపై దాడి చేసి డబ్బులు తిరిగి చెల్లించకుండా వెళ్ళిపోయాడు. దీంతో లబోదిబోమంటూ ఇద్దరు మహిళలు ఏడ్చుకుంటూ రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంటకు పైగా రోడ్డుపైనే కూర్చొని కన్నీటి పర్యంతమవుతున్న ఇద్దరినీ జనం చూస్తూ ఉండిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఇద్దరు మహిళలను రోడ్డుపై నుంచి లేపి పంపేందుకు నానా తంటాలు పడ్డారు. ఆ తరువాత స్తంభించిన ట్రాఫిక్‎ను క్లియర్ చేసేందుకు అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్నారు. ఎట్టకేలకు ఇద్దరు మహిళలను రోడ్డు పైనుంచి పక్కకు తీసుకెళ్లడంతో రెండు కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు కదిలాయి. అప్పు చెల్లించని సెక్యూరిటీ సాయి చేతిలో దెబ్బలు తిన్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..