Krishna District: ఏ కాలంలో ఉన్నారు.. పోస్ట్‌మార్టం చేశారని మహిళ మృతదేహాన్ని ఊర్లోకి రానివ్వకుండా
ఎంత ఆటవికం.. ఎంతటి అమానుషం. 20 ఏళ్లు ఆ ఊర్లోనే బతికింది ఆ మహిళ. ఏం కష్టం వచ్చిందో ఏమో తనువు చాలించింది. పోలీసులు మృతదేహానికి పోస్ట్‌మార్టం చేయించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కానీ గ్రామస్థులు ఆమె డెడ్‌బాడీని ఊర్లోకి రానివ్వలేదు.
ఆటవిక కాలం పోయింది కానీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అలాంటి మనుషులు ఉన్నారు. ఆ కుటుంబం ఇంటి మహిళను కోల్పోయి.. పుట్టెడంత బాధలో ఉంది. అలాంటి సమయంలో తోడు నిలిచి.. ఓదార్చాల్సిన ఊరి మనుషులు కఠినంగా వ్యవహరించారు. పోస్ట్ మార్టం చేసిన మహిళ మృతదేహాన్ని ఊర్లోకి తీసుకురాకుండా అడ్డుకున్నారు. ఈ అమానుష ఘటన కృష్ణా జిల్లా కాతేరులో వెలుగుచూసింది. కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఫ్యామిలీ మెంబర్స్ ఆమె డెడ్‌బాడీ ఇంటికి తీసుకొచ్చేందుకు యత్నించారు. కానీ గ్రామ పెద్దలు ఒప్పుకోలేదు. పోస్ట్‌మార్టం చేసిన శవాన్ని ఊర్లోకి ఎలా తీసుకొస్తారంటూ గొడవకు దిగారు.
బంధువులంతా ఉన్నారని.. ఇన్నాళ్లు ఆమె బతికిన ఇంటి వద్ద ఓ ఐదు నిమిషాలు అయినా దింపి తీసుకుని వెళ్తామని కుటుంబ సభ్యులు బ్రతిమాలారు. అయినా గ్రామ పెద్దల మనస్సు కరగలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక మృతదేహంతో రోడ్డుపైనే బైఠాయించారు కుటుంబీకులు. తమ బాధను అర్థం చేసుకుని.. పోలీసులు, అధికారులు అయినా గ్రామ పెద్దలకు సర్ది చెప్పాలని వారు కోరుతున్నారు.
శ్రీనగర్‌లో పర్యాటక రంగంపై జీ20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలు మూడు రోజులపాటు జరుగుతాయి. మొత్తం 60 మందికిపైగా విదేశీ ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. దాల్ సరస్సుతోపాటు సమావేశానికి వేదిక అయిన షేర్-ఏ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే రహదారుల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలు, ఎన్‌ఎస్జీ కమాండోలు, పోలీసులను మోహరించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు దాడి చేస్తారని నిఘా వర్గాలు హెచ్చరించడంతో శ్రీనగర్‌తో పాటు అన్ని నగరాల్లో భద్రతను పెంచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి