AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guntur: ఆమె వద్ద 100 కోట్ల డబ్బుతో పాటు నాగమణి.. కష్టాల్లో ఉన్న దంపతులు వెళ్లి సాయం కోరారు.. కట్ చేస్తే..

మనం కష్టాల్లో ఉంటే.. తాడే పామై కాటు వేస్తుందంటే.. ఇదేనేమో.. వాళ్లు ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారు. వాటి నుంచి బయటపడేందుకు ఇప్పుడు వారికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం. అయితే తన వద్ద డబ్బుతో పాటు నాగమణి కూడా ఉందని... అవి రెండూ కలిపి ఇస్తానని ఓ మహిళ నమ్మబలికింది. అసలే కష్టాల్లో ఉన్న ఈ దంపతులు ఆమె మాటలు నమ్మారు.

Guntur: ఆమె వద్ద 100 కోట్ల డబ్బుతో పాటు నాగమణి.. కష్టాల్లో ఉన్న దంపతులు వెళ్లి సాయం కోరారు.. కట్ చేస్తే..
Nagamani (Representative image)
T Nagaraju
| Edited By: |

Updated on: Mar 03, 2025 | 1:33 PM

Share

అతనొక రిటైర్డ్ ఉద్యోగి… గుంటూరులోని రాజరాజేశ్వరీ కాలనీలో భార్య నాగేంద్రంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.  ఈ క్రమంలోనే నాగేశ్వరావుకు.. తన మరదలు భారతి ద్వారా పల్నాడు జిల్లా కేసానుపల్లికి చెందిన వెంకాయమ్మ అలియాస్ నాగమణి పరిచయం అయింది. కొద్ది రోజుల తర్వాత వెంకాయమ్మ వద్ద వంద కోట్ల రూపాయల డబ్బులున్నట్లు భారతి… నాగేశ్వరరావు, నాగేంద్రం దంపతులకు చెప్పింది. దీంతో తమ ఆర్థిక కష్టాలు తీరాలంటే వెంకాయమ్మను ఆశ్రయించడం ఒకటే మార్గమని భావించారు.

ఈ క్రమంలోనే కొద్దీ రోజుల కిందట నాగేంద్రం కేశానుపల్లి వెళ్లి వెంకాయమ్మను కలిసి తమ పరిస్థితి వివరించింది‌. తమకు సాయం చేయాలని అడిగింది. అయితే నాగమణితో కూడిన డబ్బుల కట్టలు ఇవ్వాలంటే వాటికి పూజలు చేయాలని వెంకాయమ్మ నమ్మకంగా చెప్పింది. వెంకాయమ్మ మాటలు నమ్మిన నాగేశ్వరరావు, నాగేంద్రంలు మొదట లక్ష రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత మరొక లక్ష రూపాయలు ఇచ్చారు. అయితే నాగమణి ఉన్న డబ్బులు కట్టలు మీ ఇంటికి రావాలంటే మీ ఇంట్లో ఉన్న దిష్టి తీయాలని..  అందుకు మరికొన్ని పూజలు చేయాలని వెంకాయమ్మ చెప్పింది‌. దీంతో లక్షల రూపాయలు తెచ్చి వెంకాయమ్మకు ఆ దంపతులు ఇచ్చారు.

కొద్ది కాలంపాటు పూజలతో కాలక్షేపం చేసిన వెంకాయమ్మ ఆ తర్వాత కనిపించకుండా తిరుగుతోంది. దీంతో అనుమానం వచ్చిన దంపతులు తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు‌. అయినా వెంకాయమ్మ నుంచి స్పందన లేదు. ఈ క్రమంలోనే ఆ దంపతులు వెంకాయమ్మ సంతానానికి అసలు విషయం చెప్పారు. అయితే తమ అమ్మ పరిస్థితి బాగోలేదని ఆమె ఏం చేసినా తమకు సంబంధం లేదని వారు తేల్చి చెప్పారు. మొత్తం పదిహేను లక్షల రూపాయలు ఇవ్వడంతో మరింత నష్టపోయిన ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..