Karnataka’s KGF: కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!

కర్ణాటకలోని కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య వార్తను జీర్ణించుకోలేక తలకు రాసుకునే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నవ దంపతులను బలవంతంగా విడదీసి, వారిని వేరు చేయడంతో రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి..

Karnatakas KGF: కేజీఎఫ్‌లో నెల్లూరు యువతి ఆత్మహత్య.. కారణం ఇదే!
Jameema

Updated on: Jul 17, 2024 | 6:15 AM

వరికుంటపాడు, జులై 17: కర్ణాటకలోని కేజీఎఫ్‌ (కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆత్మహత్య వార్తను జీర్ణించుకోలేక తలకు రాసుకునే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. నవ దంపతులను బలవంతంగా విడదీసి, వారిని వేరు చేయడంతో రోజుల వ్యవధిలో భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ విషాద ఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం కనియంపాడుకు చెందిన కొండిపోగు జమీమా (27) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. తలకు రాసుకొనే నూనె తాగి బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు జమీమాకు కనియంపాడు చర్చి పాస్టర్‌ జాన్‌బాబుతో మే నెల 25వ తేదీన ప్రేమ వివాహం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న జమీమా కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో పోలీసులు, బంధువులు వారిని విడదీసి అదే నెల 27న కర్ణాటకలోని కేజీఎఫ్‌లో ఉంటున్న బంధువుల వద్దకు పంపారు.

దీంతో మనస్తాపం చెందిన జాన్‌బాబు జూన్‌ 2న కోడూరు బీచ్‌లో ఆత్మహత్యకు చేసుకుని శవమై కనిపించాడు. అయితే అప్పటి నుంచి భర్త మృతి చెందిన విషయం జమీమాకు తెలియదు. ఇటీవల ఆమెకు ఈ విషయం తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. వెంటనే ఇంట్లోని తలకు రాసుకొనే నూనె తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో వారు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.