AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: భర్త ముఖం చాటేశాడని అత్తింటి ముందే ఆందోళనకు దిగిన మహిళ.. న్యాయం చేయాలని వేడుకోలు..

ప్రాణంగా ప్రేమించానన్నాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే కాపురం చేశాడు. ఆతర్వాత ముఖం చాటేశాడు

Andhra Pradesh: భర్త ముఖం చాటేశాడని అత్తింటి ముందే ఆందోళనకు దిగిన మహిళ..  న్యాయం చేయాలని వేడుకోలు..
Basha Shek
|

Updated on: Nov 09, 2021 | 2:52 PM

Share

ప్రాణంగా ప్రేమించానన్నాడు. పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజులు బాగానే కాపురం చేశాడు. ఆతర్వాత ముఖం చాటేశాడు. ఏం చేయాలో దిక్కుతోచని భార్య..  అత్తింటి ముందే ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని దీనంగా వేడుకుంటోంది. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్లలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. దూబచర్లకు చెందిన ప్రవీణ్‌ కుమార్‌, ఆరేపల్లి సత్యవతి ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి ఏడాది క్రితం తమ ప్రేమను పెళ్లిపీటలెక్కించారు. కొన్ని రోజులు వీరి సంపారం బాగానే సాగింది. అయితే ఉన్నట్లుండి తన భర్త ముఖం చాటేశాడని బాధితురాలు చెబుతోంది.

అత్తామామలు కొట్టినా… తన భర్త తనకు కావాలని గతంలో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది సత్యవతి. కానీ ఎవరూ స్పందించలేదు. దీంతో దిక్కుతోచని ఆమె మంగళవారం అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. ఈ విషయం తెలుసుకున్న అత్తామామాలు ఆమెను కొట్టి అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. అయితే తన భర్త తనకు కావాలని, తనకు న్యాయం జరిగే వరకు ఇంటి ముందు నుంచి కదలనని సత్యవతి అక్కడే భీష్మించుకుని కూర్చుంది.

Also Read:

JC Prabhakar Reddy: రూట్ మార్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. ఈసారి గాంధీ విగ్రహం వద్దకు వెళ్లి..

Tirumala News: నాగుల చవితి వేళ.. తిరుమల శ్రీవారికి పెద్దశేష వాహనసేవ.. Watch Video

Minister Kodali Nani: బీజేపీ, టీడీపీ నేతలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిన మంత్రి కొడాలి నాని.. ఇంతకీ ఏమన్నారంటే..