Andhra Pradesh Election schedule: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఈసారి కూడా 7 విడతలలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.

Andhra Pradesh Election schedule: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
Ap Election 2024

Updated on: Mar 16, 2024 | 4:37 PM

లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ శనివారం నాడు(మార్చి 16, 2024) విడుదల చేసింది ఈసీ. నాలుగో విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు ఏపీ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించి, ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటిస్తారు. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాల తోపాటు 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం.

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు మే 13న జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ ఏప్రిల్‌ 18న వెలువడుతుంది. ఏప్రిల్‌ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్‌ 26న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. ఏప్రిల్‌ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిస్తారు. మే 13న ఎన్నికలు జరుగుతాయి. జూన్‌ 4న కౌంటింగ్‌ ఉంటుంది. జూన్‌ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌:

  • నామినేషన్లు ప్రారంభం – ఏప్రిల్‌ 18
  • నామినేషన్ల చివరి తేదీ – ఏప్రిల్‌ 25
  • నామినేషన్ల పరిశీలన – ఏప్రిల్‌ 26
  • నామినేషన్ల ఉపసంహరణ – ఏప్రిల్‌ 29
  • పోలింగ్‌ తేదీ – మే 13
  • ఎన్నికల ఫలితాలు – జూన్‌ 4

AP Poll Schedule

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…