AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మేం సిద్ధం.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌

ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ ట్వీట్‌ చేస్తూ.. 'ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. కేంద్ర ఎన్నికల కమిషన్‌ 2024 లోక్‌ షభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. సుపరిపాలనతో పాటు పలు రంగాల్లో...

PM Modi: మేం సిద్ధం.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలపై మోదీ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌
PM Modi
Narender Vaitla
|

Updated on: Mar 16, 2024 | 5:00 PM

Share

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం కాసేపటి క్రితమే లోక్‌ సభ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేసింది. మొత్తం 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ విషయమై మోదీ ట్వీట్‌ చేస్తూ.. ‘ప్రజాస్వామ్యంలో ఇది అతిపెద్ద పండగ. కేంద్ర ఎన్నికల కమిషన్‌ 2024 లోక్‌ షభ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. మేం ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాము. సుపరిపాలనతో పాటు పలు రంగాల్లో సేవలను అందించడంలో మా ట్రాక్ రికార్డ్ ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నాము’ అంటూ మోదీ వచ్చే ఎన్నికలపై ధీమా వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే ప్రస్తుతం 17వ లోక్‌సభ పదవీకాలం 16 జూన్ 2014తో ముగియనుంది. అంతకు ముందు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందుఇ. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఏ పార్టీ లేదా కూటమికి మెజారిటీ 272 సీట్లు అవసరం. మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో మొదటి దశలో భాగంగా 102 స్థానాలకు ఏప్రిల్‌ 19న ఎన్నికలు జరగనున్నాయి. అలాగే రెండో దశలో ఒమత్తం 89 స్థానాలకు ఏప్రిల్‌ 26, మూడో దశలో మే 7వ తేదీన 94 స్థానాలకు, 4వ దశలో భాగంగా 96 స్థానాలకు మే13వ తేదీన, 49వ స్థానాలకు గాను 5వ దశలో మే20వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 6వ దశలో 57 స్థానాలకు గాను మే 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. 57 స్థానాలకు గాను 7వ దశ ఎన్నికలు జూన్‌ 1వ తేదీన జరగనున్నాయి.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

అటు ఆంధ్రప్రదేశ్‌తో పాటు, ఇటు తెలంగాణలోనూ ఒకే రోజు ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 18వ తేదీన ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నామినేషన్లకు ఏప్రిల్‌ 25వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఏప్రిల్‌ 29వ తేదీని ఉపంసహరణకు చివరి తేదీగా నిర్ణయించారు. మే 13వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక  బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణంతో తెలంగాణలో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక ఏప్రిల్ 18న జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..