AP Rains: ఏపీకి వర్షాలు ఇంకా తగ్గలేదా.? తాజా వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా ఉరుములతో కూడిన చిరుజల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరి రాబోయే మూడు రోజులు వాతావరణ సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:- ———————————-
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం:- ————————————————
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:- ————————————–
ఈరోజు, రేపు, ఎల్లుండి:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ:- ———————————–
ఈరోజు, రేపు:-
తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
ఎల్లుండి:-
తేలికపాటి నుండి మోస్తరు వర్షం ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.