Andhra Rains: ఏపీకి మరో వాయు’గండం’.. ముంచుకొస్తోన్న మరో ముప్పు

ప్రస్తుత ఐఎండి సమాచారం ప్రకారం అక్టోబరు 22, మంగళవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, ఆ తర్వాత అది వాయువ్య దిశగా కదిలి అక్టోబర్24, గురువారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎటు వెళ్తుంది అనే దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

Andhra Rains: ఏపీకి మరో వాయు'గండం'.. ముంచుకొస్తోన్న మరో ముప్పు
Andhra Weather Report
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 19, 2024 | 11:27 AM

ఇప్పుడిప్పుడే ఓ వాయుగుండం సృష్టించిన వర్షాల నుంచి కోరుకుంటున్న ఏపీకి .. మరో వాయుగుండం ముప్పు తప్పేలా కనిపించడం లేదు. ఆదివారం నాటికి ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. దాని ప్రభావంతో ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి.. వాయుగుండంగా మారుతుందని తాజా బులెటిన్‌లో భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే ఈ వాయుగుండం ఏపీ నుంచి పశ్చిమ బెంగాల్ మధ్య ఎక్కడైనా తీరం దాటే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ఏర్పడిన తర్వాత… తీరం ఎక్కడ దాటుతుందనే విషయంపై అధికారికంగా స్పష్టత వస్తుంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన తర్వాత రెండు రోజులకు ఉత్తరకొస్తా జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతే ఈనెల ఈ నెల 24వ తేదీ తర్వాత ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశముంది. రాగల రెండు మూడు రోజుల్లో ఏపీలో కొన్ని జిల్లాల్లో తెలియని నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది ఐఎండి.

ఇక 19 అక్టోబర్, శనివారం… విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..    

ఏపీకి మరో ముప్పు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
ఏపీకి మరో ముప్పు.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్
వర్షంతో ఆగిన ఆట.. సెంచరీ భాగస్వామ్యంతో సర్ఫరాజ్, పంత్ దూకుడు
వర్షంతో ఆగిన ఆట.. సెంచరీ భాగస్వామ్యంతో సర్ఫరాజ్, పంత్ దూకుడు
బాత్రూం నుంచి అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..
బాత్రూం నుంచి అదో మాదిరి శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా..
దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని ఆత్మహత్య!
దసరా సెలవులకు ఇంటికి వచ్చిన విద్యార్థిని ఆత్మహత్య!
గుండెపోటు వచ్చే వారం ముందు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి..
గుండెపోటు వచ్చే వారం ముందు.. ఈ 5 లక్షణాలు కనిపిస్తాయి..
మీరు పానీపూరి ప్రియులా ..లోటలేసుకుంటూ తింటున్నారా..?వీడియో చూడండి
మీరు పానీపూరి ప్రియులా ..లోటలేసుకుంటూ తింటున్నారా..?వీడియో చూడండి
విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం..
విక్రమ్ సినిమాలో విజయ్ సేతుపతి భార్య అరాచకం..
Video: ఇదేం కర్మరా బాబు.. భారీ సిక్స్‌ కోసం స్కెచ్.. కట్‌చేస్తే..
Video: ఇదేం కర్మరా బాబు.. భారీ సిక్స్‌ కోసం స్కెచ్.. కట్‌చేస్తే..
ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నారా.? 'డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌'
ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటున్నారా.? 'డెడ్‌ బట్‌ సిండ్రోమ్‌'
ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్ ఇదే.. డేంజరస్ ప్లేయర్‌కు హ్యాండిచ్చారుగా?
ఆర్‌సీబీ రిటైన్ లిస్ట్ ఇదే.. డేంజరస్ ప్లేయర్‌కు హ్యాండిచ్చారుగా?