
అసలే ఎండకాలం. ఒకవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు నీటి లభ్యత తగ్గిపోయింది. చెరువులు సైతం ఇంకిపోవడంతో పచ్చి గడ్డి దొరకడమే గగనమైపోయింది. దీంతో గేదెలు పొలాలను మేస్తున్నాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం యనమదల పొలాల్లో విచిత్ర సంఘటన జరిగింది. పొలాలపై మేత కోసం వెళ్లిన గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కపోయింది. బయటకు రాలేక అష్టకష్టాలు పడింది. ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆ రెండు చెట్ల మధ్యే కదలకుండా ఉండిపోయింది.
ఆ దారిలో వెళ్తున్న రైతులు.. గేదె రెండు తాటి చెట్ల మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించారు. గేదెను బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అయినా రైతులు వల్ల కాలేదు. ఏం చేయాలో అర్ధం కాలేదు. అప్పటికే గేదె ఇరుక్కు పోయి పది గంటలు దాటి పోయింది. రైతులు చెట్టు కోసే యంత్రం తీసుకొచ్చి రెండు చెట్లలో ఒక దానిని తొలగించి గేదెను బయటకు తీశారు. దీంతో ఆ గేదె యజమాని సంతోషంగా దానిని ఇంటికి తోలుకు పోయారు. గేదె ధర లక్ష రూపాయల వరకూ ఉంటుందని రైతు చెప్పాడు. అందరి సాయంతో గేదె ప్రాణాలు కాపాడటం తనకు సంతోషంగా ఉందని రైతు చెప్పాడు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…