AP News: పూరి గుడిసె నుంచి వింత శబ్దాలు.. లోపలికి వెళ్లి చూడగా.. బాబోయ్.! భయంతో

| Edited By: Ravi Kiran

Jun 28, 2024 | 1:45 PM

అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. పూరి పాకలోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయరు పాకలో నివాసం ఉంటున్న కుటుంబం. ఆ వివరాలు ఇలా..

AP News: పూరి గుడిసె నుంచి వింత శబ్దాలు.. లోపలికి వెళ్లి చూడగా.. బాబోయ్.! భయంతో
Viral Video
Follow us on

అనకాపల్లి జిల్లాలో మరో భారీ గిరినాగు హడలెత్తించింది. ఆహారం కోసం వెతుక్కుంటూ జనావాసాల్లోకి వచ్చేసింది. పూరి పాకలోకి దూరింది. భుసలు కొడుతూ భయపెట్టింది. శబ్దాలు విని ఆందోళన చెంది భయంతో వణికిపోయరు పాకలో నివాసం ఉంటున్న కుటుంబం.

వివరాల్లోకి వెళ్తే.. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం రైవాడలో.. 12 అడుగుల గిరినాగు కలకలం సృష్టించింది. ఎస్సీ కాలనీలోని ఓ పూరిగుడిసెలో భారీ గిరినాగు కనిపించింది. ఈ 12 అడుగుల గిరినాగు ఆహారం వెతుక్కుంటూ.. పాకలో దూరింది. అక్కడ తిష్ట వేసుకుని కూర్చుంది. వింత శబ్దం వస్తుండడంతో పాకలో నివసిస్తున్న కుటుంబం తొంగి చూసేసరికి.. భారీ గిరినాగు కనిపించింది. భయభ్రాంతులకు గురైన కుటుంబం, స్థానికులు.. స్థానిక స్నేక్ క్యాచర్, అటవీ అధికారులకు సమాచారం ఇచచ్చారు. రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్.. గంట పాటు శ్రమించి 12 అడుగుల గిరినాగును చాకచక్యంగా పట్టుకున్నారు. అక్కడ నుంచి తీసుకెళ్లి.. అటవీ అధికారుల సహకారంతో ఫారెస్ట్ రేంజ్ ఏరియాలో విడిచిపెట్టారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఇది చదవండి: ఉన్న ఊర్లోనే నెలకు రూ. లక్ష సంపాదన.. ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఇక తిరుగుండదు

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..