ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ శాతం గంటగంటకు పెరుగుతోంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తుతున్నారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ఆసక్తిచూపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనా తిరిగి పోలింగ్ శాతం పుంజుకుంది. చెదురుమొదలు ఘటనలు మినహా మిగిలిన ప్రాంతాల్లో పోలింగ్ సాధారణంగా జరుగుతోంది. ముఖ్యంగా మహిళా ఓటర్లు, యువత, కొత్తగా ఓటు హక్కువచ్చిన వారు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు బారులుదీరారు. ఏపీలో మధ్యాహ్నం 1 గంట వరకు 40.26 శాతం పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపారు. అలాగే తెలంగాణలో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు 40.28శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించారు ఎన్నికల అధికారులు. పలు ప్రాంతాల్లో వర్షం కారణంగా పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య చిన్న చిన్న సంఘటనలు మినహా మరెక్కడా ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు తలెత్తలేదంటున్నారు అధికారులు. పురుషులకంటే కూడా మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
ఏపీ, తెలంగాణ ఎన్నికల ఓటింగ్ లైవ్ అప్డేడ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..