Viveka Murder Case: హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో అవినాష్‌ రెడ్డి! సీబీఐ నెక్ట్స్‌ స్టెప్‌పై సర్వత్రా ఉత్కంఠ

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే CBI విచారిస్తోందని..

Viveka Murder Case: హైకోర్టు తీర్పుపై అప్పీలుకు వెళ్లే యోచనలో అవినాష్‌ రెడ్డి! సీబీఐ నెక్ట్స్‌ స్టెప్‌పై సర్వత్రా ఉత్కంఠ
YS Avinash Reddy
Follow us

|

Updated on: Mar 17, 2023 | 9:13 PM

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో CBI దూకుడు పెంచనుంది. ఈ కేసులో ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని నాలుగు సార్లు విచారించింది. మరోవైపు సీబీఐ విచారణను వ్యతిరేకిస్తూ .. హైకోర్టులో పిటిషన్ చేశారు అవినాష్‌రెడ్డి. CBI విచారణపై స్టే ఇవ్వటంతో పాటు మూడు అంశాలు ప్రస్తావిస్తూ హైకోర్టులో వాదనలు వినిపించారు. ఇందులో రెండింటిని పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. CBI తన విచారణను యధావిధిగా కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. తనపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేలా ఆదేశాలు ఇవ్వాలన్న అవినాష్ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అరెస్టు విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. విచారణ జరిపే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ తప్పనిసరని ఆదేశాలు జారీ చేసింది. విచారణ జరుగుతున్న తీరు న్యాయవాదికి కనిపించేలా అనుమతించాలని పేర్కొంది. హైకోర్టు తీర్పు తర్వాత CBI ఎలా వ్యవహరిస్తుందన్నది కీలకంగా మారింది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే హైకోర్టు తీర్పుపై అప్పీల్ కు అవినాష్‌రెడ్డి అప్పీల్‌కు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగానే సీబీఐ విచారిస్తోందని.. ఈ కేసుతో తనకుఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి చెబుతున్నారు. తనను ఎలాగైనా ఈ కేసులో ఇరికించాలని భావిస్తోందన్నది ఆయన వాదన.

మరి వైఎస్‌ వివేకా హత్య కేసులో CBI నెక్ట్స్‌ స్టెప్ ఏంటి? అవినాష్ రెడ్డికి సీఆర్పీసీ 41 కింద నోటీసులు ఇస్తుందా? విచారణపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించడంపై అవినాష్ రెడ్డి అప్పీల్‌కు వెళ్తారా? మొత్తానికి ఈ కేసులో అటు CBI, ఇటు అవినాష్‌రెడ్డి ఎలా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని  ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.