TV9 Impact: వైజాగ్‌ కిడ్నీల దందాపై స్పందించిన ప్రభుత్వం.. తిరుమల ఆస్పత్రి సీజ్‌

|

Apr 28, 2023 | 8:05 AM

కిడ్నీ బాధితుడు వినయ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశాఖలో జరిగిన కిడ్నీ దందాపై అధికారులు సీరియస్‌ అయ్యారు. టీవీ9 కథనాలకు స్పందించి తిరుమల ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనపై డీఎమ్‌హెచ్‌వో నివేదిక రెడీ చేసింది

TV9 Impact: వైజాగ్‌ కిడ్నీల దందాపై స్పందించిన ప్రభుత్వం.. తిరుమల ఆస్పత్రి సీజ్‌
Tirumala Hospital
Follow us on

మానవ అవయవాల అక్రమ విక్రయ దందాపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. టీవీ9 ఎఫెక్ట్‌తో జిల్లా అధికారుల్లో కదలిక వచ్చింది. విచారణ చేసి కిడ్నీదందా చేసిన తిరుమల ఆస్పత్రిని సీజ్ చేశారు. కిడ్నీ బాధితుడు వినయ్ ఉదంతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. విశాఖలో జరిగిన కిడ్నీ దందాపై అధికారులు సీరియస్‌ అయ్యారు. టీవీ9 కథనాలకు స్పందించి తిరుమల ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రిలో జరిగిన ఘటనపై డీఎమ్‌హెచ్‌వో నివేదిక రెడీ చేసింది. అంతకు ముందు విశాఖ కిడ్నీ రాకెట్‌ కేసులో డీఎంహెచ్‌వో విచారణ చేపట్టారు. వాంబే కాలనీలో బాధితుడి ఇంటికి వెళ్లి కిడ్నీ మార్పిడీపై ఆరా తీశారు. బాధితుడు వినయ్‌ నుంచి వివరాల సేకరించారు. మరోవైపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.పి.జగదీశ్వర రావు వైజాగ్ తిరుమల ఆసుపత్రిని తనిఖీ చేసి… క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆక్ట్ 2002/2007 ప్రకారం రిజిస్ట్రేషన్ కాలేదని నిర్ధారించారు. రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే O.P సేవలు, ఎముకల శస్త్ర చికిత్సలు చేస్తున్నారని, 2 ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయని గుర్తించి… నిబంధనల ఉల్లంఘనపై నివేదిక రెడీ చేశారు. ఈ మేరకు హాస్పిటల్‌పై చర్యలు తీసుకున్నారు. పంచనామా నిర్వహించి, ఈ మొత్తం ఎపిసోడ్‌లో తిరుమల హాస్పిటల్‌ ను సీజ్ చేశారు.

విశాఖలో కిడ్నీ రాకెట్‌ దందా దడపుట్టిస్తోంది. కిడ్నీ మాఫియా చేతికి చిక్కి ప్రాణాపాయ దశకి చేరుకున్నాడు వినయ్‌ కుమార్‌. ఒక్క వినయ్‌ కుమార్‌ కాదు. మరో ఆరుగురికి అక్రమ అవయవ మార్పిడీ జరిగినట్టు టీవీ9 దృష్టికి వచ్చింది. కిడ్నీ రాకెట్ కేసులో ఎట్టకేలకు టీవీ9 కథనాలకు స్పందించారు వైద్యాధికారులు. అమాయకులకు ఎరవేసి… పేదజనం అవయవాలను కాజేస్తోన్న ముఠా చేతిలో బలయ్యాడు వినయ్‌ కుమార్. వాంబేకాలనీకి చెందిన వినయ్‌కి డబ్బు ఆశచూపారు కిడ్నీ బ్రోకర్లు ఇలియానా, కామరాజు, శ్రీను. ఒక కిడ్నీ అమ్మేస్తే..8లక్షల 50 వేలు ఇస్తామని నమ్మబలికారు. ఆపరేషన్‌ అయ్యాక రెండు లక్షలు చేతిలో పెట్టి ఉడాయించిన ఘటన విశాఖలో కలకలం రేపింది. పెందుర్తి పరిధిలో తిరుమల హాస్పిటల్ లో బాధితులు వినయ్ కుమార్ నుంచి వైద్యులు కిడ్నీ తీసుకున్నారు. ఈ ఆసుపత్రికి అసలు అనుమతులేలేవని గుర్తించారు అధికారులు. కలెక్టర్‌కు నివేదిక ఇచ్చి ఆసుపత్రి సీజ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..